Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Film లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!

లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!

by Rama
Lambasingi

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరి లో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.

ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు “నచ్చేసిందే… డోలారే… వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్ గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ… కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివి కి అలాగే భరత్ రాజ్ కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నటీనటులు:
భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కూరసాల
కథ, మాటలు ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
కెమెరామెన్: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
లిరిక్స్: కాసర్ల శ్యామ్

ఇది చదవండి: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌..


‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ …
పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు – సంగీత దర్శకుడు అజయ్ అరసాడ.
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ …
వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: