Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News CAA పై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ…

CAA పై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ…

by Prakash
The Supreme Court stayed the Citizenship Amendment Act

పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏ పై స్టే విధించాలని కోరుతూ మొత్తం 237 పిటిషన్ లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా పిటిష‌న్ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే ఈ కేసులో మ‌ళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచార‌ణ ఉంటుంద‌ని తెలిపింది. సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు చట్టం నిబంధనల అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో.. సీఏఏ అమలు కొనసాగనుంది. మరోవైపు 237 పిటిషన్లపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుందని.. దానికోసం నాలుగు వారాల సమయం కావాలని కోర్టుని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఈ చట్టం వల్ల ఏ వ్యక్తి పౌరసత్వం పోదని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్, టీఎంసీ నేత మహువా మొయిత్రా ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

018683
Total views : 89169

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.