వర్షాకాలం ప్రారంభంలోనే కురుస్తున్న ఈ కొద్దిపాటి వర్షాలకి భద్రాచలం ఏజెన్సీకి వరద కష్టాలు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు దిగువకు చేరుకుంటుంది. ఏజెన్సీకి సరిహద్దున ఉన్నటువంటి ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు దిగువ ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీకే వస్తుంది.నిన్న కురిసిన వర్షం కారణంగా దుమ్మగూడెం మండలంలోని సీతవాగుకు భారీగా వరద నీరు వస్తుంది. సీతవాగు పర్ణశాల పుణ్యక్షేత్రంలోని నార చీరల ప్రాంతం మీదుగా ప్రవహిస్తుంటుంది. భద్రాచలం ఏజెన్సీకి వరద కష్టాలు ప్రారంభమయ్యాయి.వరదనీరు రావడంతో పర్ణశాల క్షేత్రం వద్ద నార చీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది దీంతో ఆ ప్రాంతంలోని వ్యాపార సముదాయాలు అన్నిటిని తరలించవలసి వచ్చింది. నార చీరలు ప్రాంతం పూర్తిగా నీటి మునిగి ఉండడంతో సందర్శకుల పర్యటనను నిలిపివేశారు అయితే వర్షాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పూర్తిగా వర్షాకాలం ప్రారంభమైతే ముందు ముందు వరద ముప్పు ఎలా ఉంటుందో అని ఏజెన్సీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
- అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
- కలగానే మిగిలిన సొంతింటి కల..పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
- భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 61799