వయనాడ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో రాహుల్ పోటీ చేశారు. చివరకు రాయ్ బరేలీని ఉంచుకున్నారు. వయనాడ్ కు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే వన్సైడ్ మెజారిటీతో ప్రియాంక గాంధీ ఆధిక్యం కనబరించారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ హవా కనిపించింది.
ఇక్కడ ప్రియాంక గాంధీ గెలుస్తోందని అంతా ముందే ఊహించారు. ప్రియాంకపై బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీ చేశారు. అక్కడ ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భారతీయ జనతాపార్టీ చూసింది. అందుకు తగ్గట్లుగానే తన శక్తియుక్తులను వయనాడ్ లో కేంద్రీకరించి పని చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు వయనాడ్ లో సుడిగాలి ప్రచారం చేశారు. ఇంత చేసినా వయనాడ్ లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తప్పలేదు. కేరళలో బీజేపీకి బలం లేకపోవడం.. అక్కడున్న వారంతా సెక్యూలర్ భావజాలంతో ఉండడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిగింది. కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
- రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
- స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
- పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి