Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Film ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు..

ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు..

by CVR NEWS

టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ , రష్మిక మంద‌న్న ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన అంటే సరిగ్గా వారం కిందట ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఉదయపూర్ లో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఒకటయ్యారు. వీళ్ళ వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయపూర్ లో జరిగిన పెళ్లి వేడుకకు కొంత మంది సన్నిహితులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ జంట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇక హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరోలు వ‌చ్చారు.

విజయ్ దేవరకొండ , రష్మిక వివాహం జరిగి దాదాపు వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల పాటు రకరకాల పెళ్లి కార్యక్రమాల నేపథ్యంలో కొత్త జంట నలిగిపోయింది. కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పెళ్లి కార్యక్రమంలో పాల్గొంది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం… పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే పెళ్లి రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశారు. పెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి… ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు. అండర్ గ్రౌండ్ లోనే రిలాక్స్ అవుతామని వెల్లడించాడు. దీంతో విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisements

You may also like

Our Visitor

009355
Total views : 61925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.