Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News ముంబై వీధుల్లో ఆటోను నడిపిన అమృత ఫడ్నవిస్..

ముంబై వీధుల్లో ఆటోను నడిపిన అమృత ఫడ్నవిస్..

by CVR NEWS
ముంబై వీధుల్లో ఆటోను నడిపిన అమృత ఫడ్నవిస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై వీధుల్లో స్వయంగా ఆటోను నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.’భామ్లా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘పింక్ ఈ-రిక్షా’ కార్యక్రమాన్ని అమృత ఫడ్నవిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు మద్దతుగా ఆమె స్వయంగా ఆటోను నడిపారు.మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభించనుంది. ప్రస్తుతం అమృత ఫడణవీస్ ఆటోను నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: