Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

by CVR NEWS
దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్‌ చేశారు. దలైలామా నిండు నూరేళ్లూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడంలో, మానవ హక్కుల రక్షణ కోసం దలైలామా చేస్తున్న అద్వితీయమైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. లోకానికి దయ, అహింస, కరుణ వంటి ఉన్నతమైన విలువలను పరిచయం చేస్తూ.. దశాబ్దాలుగా కోట్లాది మందిలో దలైలామా స్ఫూర్తిని నింపుతున్నారని ప్రశంసించారు. సమాజంలో ద్వేషాన్ని వీడి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలంటూ దలైలామా ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయన్నారు. ఇలాగే మరిన్ని సంవత్సరాల పాటు సమాజానికి మార్గదర్శనం చేయాలని, ఆయనకు దైవ బలం, దీర్ఘాయుష్షు లభించాలని ఆ దేవుడిని ప్రార్థించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: