తమ దేశంలోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. అయితే, ఏదైనా నష్టం వాటిల్లిందా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఇరాన్ ఆరోపణలపై అమెరికా సైన్యం కూడా స్పందించలేదు. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ బుషెహర్ కావడం గమనార్హం. రష్యన్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఈ ప్లాంట్ పరిసర ప్రాంతాలపై యుద్ధం ప్రారంభం నుంచి పలుసార్లు దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన దాడిలో క్షిపణి శకలం తగిలి ప్లాంటు సిబ్బందిలో ఒకరు చనిపోయారని ఇరాన్ వెల్లడించింది. సమీపంలోని భవనం కూడా దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే, దీనిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం ఆందోళనకర పరిణామమే అయినప్పటికీ.. ఆ ఘటనలో అణువిద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ విడుదల కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది.
అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.
261
previous post