గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన ‘సంకల్పం’ అవగాహన కార్యక్రమం విశేష స్పందన పొందింది. వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ దాసరి రవీంద్రబాబు, వన్ టౌన్ సీఐ సీహెచ్. రాంబాబు పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని, క్షణిక ఆనందం కోసం జీవితాన్ని ప్రమాదంలో పడేయొద్దని సూచించారు. చదువు, క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో గంజాయి రహిత సమాజం కోసం ‘సంకల్పం’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
తెనాలిలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధక సంకల్పం.
51
previous post