Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

by CVR NEWS

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడ్డిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న వి.బి.జి రాంజీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి సరఫరా, నీటి నాణ్యత ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు. అలాగే కసుమూరు రోడ్డులోని వీరన్నకనుపూరు చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించి… అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: