కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం.. APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు. రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు. APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు. 3 రాజధానుల విజన్‌లో APని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.
Guntur
అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కళేబరం రావటం పై ప్రభుత్వం పైన మండిపడ్డ గుంటూరు పార్లమెంటు అంగనవాడి, డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ భాగం.. వైసిపి ప్రభుత్వం అంగన్ వాడి శాఖపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణీ స్త్రీల ప్రాణాలతో ఆడుకుంటుందని, అలాగే అంగన్వాడీలపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు అవసరమైన అవసరాలపై దృష్టి సారించకుండా టిడిపి నాయకుల పైన మా అధినేత చంద్రబాబు, లోకేష్ లపై దృష్టి సారించిందని, గర్భిణీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కలేబరం వచ్చింది అంటే ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అర్థమవుతుందని, ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై దృష్టి సారించకుండా విపక్షాలపై దృష్టి పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అని మండిపడుతున్న గుంటూరు పార్లమెంట్ అంగనవాడి, డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ.
అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై వర్కు షాపు.. విజిలెన్స్ మాన్యువల్ మరియు హేండ్ బుక్ ను ఆవిష్కరించిన సిఎస్ జవహర్ రెడ్డి. విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023, అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కార్యసాల జరుగుతోంది. ఈకార్యసాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, డిజిపి కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి, రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ వీణా ఈస్, డిజి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కుమార్ విశ్వజిత్, పలువురు విజిలెన్స్ అధికారులు, ఎసిబి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు.. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు.. ఏ-1 గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమా.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదు.. ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ ఫోకస్.. ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని సీఐడీ అభియోగాలు..
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు. హాజరై చిందులు వేశారు. సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు. మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడ నుంచి విద్యార్థులను పంపిచివేసారు.
పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు. కౌలుకు తీసుకొని, ఎకరాకి రూ.30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతుల కోసం ఏమీ చేయడంలేదంటూ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమీ చేయలేరని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కిలారు వెంకట్రావు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏటీఎం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని, నియోజకవర్గాన్ని ఆయన ఎనీటైమ్ మనీగా మార్చుకున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని పాడి గేదె లాగా మార్చారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. డబ్బులు దండుకోవడం తప్పితే ప్రజల బాధలు ఆయనకు పట్టవని వ్యాఖ్యానించారు. ప్రజల బాధలు కలెక్టర్‌కు పట్టవని, ముఖ్యమంత్రి కూడా పట్టవని ఆరోపించారు. టీడీపీ హయంలో ఈ ప్రాంతంలో పంటలను కాపాడడానికి రూ.53 కోట్లతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. కానీ నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రైతు సమస్యలు పరిష్కారం చేయకపోగా, వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చిన నిజం గెలవాలి – కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా…లుగుదేశం పార్టీ కార్యాలయం బయట నిజం గెలవాలి న్యాయం జరగాలి అంటూ న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. వినూత్న రీతిలో మోకాళ్ళ పైన నిలపడి న్యాయదేవత కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని, న్యాయాన్ని బ్రతికించి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమయిందని వేడుకున్నారు. అన్యాయం శిక్షింపబడాలని ఈ కార్యక్రమంలో న్యాయదేవతగా జిల్లా తెలుగుమహిళా అధికార ప్రతినిధి పేరం అనిత కుమారి, తెలుగు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కొత్తూరి వెంకట్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేళం సైదయ్య, తెలుగుయువత విద్యార్థి నేతలు మహిళలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. అయ్యన్నకుంటిపల్లెకి చెందిన గేరా సందీప్ గ్రామంలోని పరమేశ్వర సాయి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు… హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





Total views : 75126