దేశ సరిహద్దులను కాపాడుతున్న బి ఎస్ ఎఫ్ జవాన్‌కు.. ఇంటి సరిహద్దు విషయంలో రేకెత్తిన వివాదం అతడిని ఆందోళనకు గురిచేస్తోంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త మురమళ్ల గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ జె.వి.వి. సత్యనారాయణ తన కుటుంబం భూ వివాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన చెందుతున్నాడు. తన ఇంటి వెనుక ఉన్న నాలుగు ఇళ్ల వారికి దారి లేకపోవడంతో, గతంలో తమ పెద్దలు మానవతా దృక్పథంతో మూడు అడుగుల దారి ఇచ్చారని అయితే ప్రస్తుతం అదే దారిని కార్లు వెళ్లేలా విస్తరించాలని డిమాండ్ చేస్తూ తన ఇంటి వెనుక నివసించే గంజా శ్రీనివాస్ స్థానిక యస్ ఐ రవీంద్ర సహకారంతో తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద పిజీఆర్ఎస్ నందు కలెక్టర్ కు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనకు సంబందించిన మరింత సమాచారం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి బాబీ అందిస్తారు.
దేశ సరిహద్దులను కాపాడుతున్న బి ఎస్ ఎఫ్ జవాన్‌కు..
296
previous post