Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home Andhra Pradesh కోన‌సీమ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే వ‌శిష్ట న‌దీపాయ‌పై నిర్మించిన దిండి..

కోన‌సీమ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే వ‌శిష్ట న‌దీపాయ‌పై నిర్మించిన దిండి..

by CVR NEWS

కోన‌సీమ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే వ‌శిష్ట న‌దీపాయ‌పై నిర్మించిన దిండి – చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ వారధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి దిండి-చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో… రాజోలు, అటు పాలకొల్లు, నరసాపురం, ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల వారధిగా ఉన్న ఈ వంతెన పైనుంచి స్కూళ్లు, కాలేజీల బస్సులు వందకు పైగానే నిత్యం నడుస్తుంటాయి. అయితే బస్సుల రాకపోకలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఇరువైపుల నుంచి కాలినడకన నడిచి వంతెనకు అటు, ఇటు ఉంచిన వాహనాలపై కాలేజీలకు వెళ్లవల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ వారధి పనులు ఎప్పటికి పూర్తవుతాయో N H అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: