Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ..

అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ..

by CVR NEWS

అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్పేస్ పయనీర్’ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలమైంది. రాకెట్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘ఫాల్కన్ 9’ రాకెట్‌కు పోటీగా తియాన్‌లాంగ్-3ని రూపొందించారు. భారీ పేలోడ్‌లను మోసుకెళ్తూ, తిరిగి భూమిపైకి వచ్చి ల్యాండ్ అయ్యే పునర్వినియోగ టెక్నాలజీతో దీనిని తయారుచేశారు. ఐతే రాకెట్‌ను ప్రయోగించిన కొన్ని నిమిషాలకే ప్రయోగం విఫలమై.. నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. రాకెట్ మొదటి దశ విడిపోయే క్రమంలో..ఇంజిన్ పనితీరులో తలెత్తిన సమస్యతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ వైఫల్యంపై స్పేస్ పయనీర్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ‘‘తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరమని. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, తదుపరి మిషన్లను మరింత పటిష్ఠంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల మార్కెట్‌లో పట్టు సాధించాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో తియాన్‌లాంగ్-3 వైఫల్యం ..చైనా ప్రైవేట్ అంతరిక్ష కార్యక్రమాలకు తాత్కాలిక అవరోధంగా నిలిచింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: