శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు గంగల జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈఓ KS రామారావు ఇతర అధికారులు మరియు ఆలయ బోర్డు సభ్యులు పాల్గొని ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం లో అలంకార మండపం వద్ద ఏడు గంగమ్మలకు సారెను వుంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి వేదమంత్రాలు నడుమున సారి ను తీసుకొని నాలుగు మాడా వీధులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తి ఏడు గంగమ్మ గుడి వద్దకు సారెను తెచ్చి ఏడు వీధులలో జాతరను జరిపించే నిర్వాహకులకు అందజేశారు.
Devotional
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా. అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
రామానుజాచార్యుల గొప్పదనం:
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.
ప్రాచుర్యంలోకి రాని రహస్యం:
క్రీస్తు శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు. గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు. క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.
Read Also..
Read Also..
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన ‘అయోధ్య’ ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు. రామాయణాన్ని ఒక మహా కావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి, హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకే కాదు.. ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ రామ జన్మభూమి విశేషాలు ఏమిటి? ప్రజలతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధం ఏమిటి? పర్యాటకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య చరిత్ర:
అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. శ్రీరాముని పూర్వీకుడైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కధనం. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కధనాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు. సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్య వాక్కుతో సూర్య వంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భువికి దించిన భగీరధుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరధుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరధుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీ రాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంత కాలం రాజ్య పరిపాలన చేశాడు. అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి, సుందరి, పాడలిప్తసూరీశ్వరి, హరిచంద్ర, అచలభరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మతతీర్ధంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది.
హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్ధం వరకూ అయోధ్య బౌద్ధ మత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా. అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలు మార్లు సందర్శించినట్లు కూడా కధనం. అదే విధంగా మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీంతో హిందూ, బౌద్ధ, జైన, ముస్లిం మతాల పవిత్ర ప్రదేశంగా అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభించింది.
అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు:
అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు. సరయూ నది, రామజన్మభూమి ఆలయం ప్రదేశం, అన్నదాన సమాజం, కౌసల్యాదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం వంటివి ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనవి.
తూఫాన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మెట్టు మార్గం శుక్రవారం (డిసెంబర్ 8, 2023) నుండి నిలిపివేయబడింది. తూఫాన్ కారణంగా తిరుమల కొండపై వాతావరణం అస్థిరంగా ఉంది. భారీ వర్షాలు, తుఫానులు, గాలి వేగం పెరగడం వంటి వాటి వల్ల మెట్టు మార్గంలో ప్రమాదం ఉందని భావించి, తిరుమల శ్రీవారి ఆలయ ఈవెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
తూఫాన్ ముగిసిన తర్వాత, మెట్టు మార్గం తిరిగి ప్రారంభించబడుతుందని ఈవెంట్స్ కమిటీ తెలిపింది. అప్పటివరకు, భక్తులు టెలిఫోన్ లేదా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తిరుమలకు రైలు మార్గం ద్వారా వెళ్లవచ్చు.
తూఫాన్ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు నిరాశ చెందుతున్నారు. అయితే, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల శ్రీవారి ఆలయం తెలిపింది.
ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ గారు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి, శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వీరికి ఆలయ చైర్మన్ శ్రీ గుత్తుల నాగబాబు గారు మరియు ధర్మకర్తలు స్వాగతం పలకగా అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదములు అందజేసినారు. చైర్మన్ గారు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందజేసినారు.
సోమారామం లో జనార్ధన స్వామి వార్లను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయం లో వేకువజామునే పవిత్ర కార్తీకస్నానమాచరించి తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆలయంలో నలుమూలల శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రాంగణంలో కార్తీక దామోదరుని స్మరిస్తూ కార్తీక దీపాలు వెలిగించి సోమగుండం చెరువులో వదిలారు. కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి వారికి ఆలయ ప్రధానఅర్చకులు, వేదపండితులు,అర్చకులు రుద్రాభిషేకాలు పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు
రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలోనే ఆలయానికి చేరుకుని శివ నామస్మరణ చేస్తున్నారు. పంచారామ క్షేత్రాల సందర్శనలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు భక్తులు ఆలయానికి విచ్చేశారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సందడి చేశారు కార్తీక మాసం మూడవ సోమవారం మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలాగే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించరు కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ లో పాలు, బిస్కెట్లు, అల్పాహారం, మంచినీరు అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
శివుడు హిందూమతంలో ఒక ముఖ్యమైన దేవుడు. అతను శివలింగం రూపంలో పూజించబడతాడు. శివుడికి అభిషేకం చేయడం ఒక ముఖ్యమైన పూజా విధానం. అభిషేకం అనేది శివుడిని పవిత్రమైన ద్రవాలతో అభిషేకించడం. శివుడికి అభిషేకం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
- శివుడి అనుగ్రహం పొందడానికి: శివుడు దయగల దేవుడు. అతనిని భక్తితో పూజిస్తే, అతను తన భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివుడికి అభిషేకం చేయడం వల్ల అతని అనుగ్రహం పొందవచ్చు.
- పాపాలను పోగొట్టుకోవడానికి: శివుడు పాపాలను పరిహరించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల పాపాలు పోగొట్టుకోవచ్చు.
- మోక్షాన్ని పొందడానికి: శివుడు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు.
- ఆరోగ్యం మరియు సంపదను పొందడానికి: శివుడు ఆరోగ్యం మరియు సంపదను ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం మరియు సంపదను పొందవచ్చు.
- కష్టాలను తొలగించడానికి: శివుడు కష్టాలను తొలగించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల కష్టాలను తొలగించవచ్చు.
శివుడికి అభిషేకం చేయడానికి అనేక రకాల ద్రవాలను ఉపయోగించవచ్చు. వాటిలో పాలు, నీరు, పంచామృతాలు, చందనం, పూలు, పువ్వుల రేకులు, ధూపం, దీపాలు మొదలైనవి ఉన్నాయి. శివుడికి అభిషేకం చేయడానికి సరైన సమయం ఉదయం లేదా సాయంత్రం. అభిషేకం చేయడానికి ముందు, శివలింగం శుభ్రంగా ఉండాలి.
శివుడికి అభిషేకం చేయడం ఒక శక్తివంతమైన పూజా విధానం. ఇది శివుడి అనుగ్రహం, మోక్షం, ఆరోగ్యం, సంపద మరియు కష్టాలను తొలగించడానికి సహాయపడుతుంది.