Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Health వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
Walnuts

వాల్‌నట్స్‌లో విటమిన్‌ B6, E, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, రాగి, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్‌నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్లలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. అల్జీమర్స్‌, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. రోజూ వాల్‌నట్స్‌ తింటే రక్తహీనత దూరం అవుతుంది. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ వాల్‌నట్స్‌ తింటే ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి. రోజూ వాల్‌నట్స్‌ తింటే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిక్స్‌ తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. నట్స్‌ అన్నింట్లో కల్లా వాల్‌నట్స్‌ బలమైన ఆహారం. వీటిని ఆక్రోట్స్‌ అని కూడా పిలుస్తారు. రోజుకు 4 వాల్‌నట్స్‌ నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

008604
Total views : 56939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.