449
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో విజిలెన్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా గడ్డం అమర్నాథ్ రెడ్డికి చెందిన షెడ్‌లో 234 బస్తాల పీడీఎస్ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన ఈ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, దందాకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన అధికారులు గడ్డం అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యాన్ని తదుపరి చర్యల కోసం రెవెన్యూ శాఖ అధికారులకు విజిలెన్స్ పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.