Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home International అంతర్జాతీయ అందాల పోటీలు..!

అంతర్జాతీయ అందాల పోటీలు..!

by Satya
International beauty pageants

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి పోటీలు ఈసారి భారత్‌ వేదికగా జరగనున్నాయి. అంతర్జాతీయ అందాల పోటీల 71వ ఎడిషన్‌ను ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు భారతదేశంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశం చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -ఐటీడీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఢిల్లీలో ది ఓపెనింగ్‌ సెర్మనీ, ఇండియా వెల్‌కమ్స్‌ ది వరల్డ్‌ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది. మార్చి 9న ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఫైనల్స్‌ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కాతో పాటు మాజీ విజేతలు ఈ మేరకు ప్రకటన చేశారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: