Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

by Satya
ISRO ready for another key launch

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 14‌ రాకెట్ ను ప్రయోగించనుంది. ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇస్రో షేర్ చేసింది. జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది. వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఈ ‘ఇన్సాట్-3డీఎస్’ ఉపగ్రహాన్ని రూపొందించింది. మెరుగైన రీతిలో వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాలతో పాటు భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: