Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

by Satya
Kavitha


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ:

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ ద్వారా సీబీఐకి తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా నేడు విచారణకు హాజరుకావడం సాధ్యం కావడంలేదన్నారు. 2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…

ఎలాంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదని కవిత తెలిపారు. బీఆర్ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రావడం వల్ల అవరోధం కలుగుతుందన్నారు. అందుకే, 41ఏ నోటీసులను రద్దయినా చేయండి, లేదా వెనక్కి అయినా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సీబీఐ తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్దతిలో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56906

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.