Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National బీజేపీలో చేరిన నవీన్ జిందాల్..

బీజేపీలో చేరిన నవీన్ జిందాల్..

by Satya
Naveen Jindal joins BJP


Naveen Jindal:

ఎన్నికల వేళ హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కాంగ్రెస్‌(Congress)కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) వికసిత్ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు బీజేపీలో చేరినట్టు నవీన్ జిందాల్ తెలిపారు. కురుక్షేత్ర నుంచి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌(Dr. Manmohan Singh)కు, కాంగ్రెస్ నాయకత్వానికి జిందాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశా అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

2004-14 మధ్య కురుక్షేత్ర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఆయన.. ప్రస్తుతం బీజేపీ తరపున మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా నవీన్ జిందాల్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. గత పదేళ్ల కాలం మోదీ సారథ్యంలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ భారీ ముందడుగని ప్రశంసించారు. రామ మందిర నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీకి జిందాల్ చేరికతో కొత్త ఊపు వచ్చిందని పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే తెలిపారు.

ఇది చదవండి: బీజేపీ ఐదో లిస్ట్‌ను రిలీజ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు MP టికెట్


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.
బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి. …
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: