Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Film ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం..

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం..

by CVR NEWS
ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ , యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదిభట్ల పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్ ప్రాణ స్నేహితులు. తమ సొంత ఊరి నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా, బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో భరత్, త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భరత్ ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించగా, త్రిలోక్ పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. భరత్ కాంత్ మృతిపై నటి అషురెడ్డి సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012383
Total views : 74908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.