288
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ మారిన 24 గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో సుమారు పది లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జెన్ జీ యువత పెద్ద ఎత్తున అన్‌ఫాలో చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో క్యాంపెయిన్’ నడుస్తుండగా, చడ్డాపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పెట్టిన పాత పోస్టులను కూడా ఆయన తొలగించినట్లు తెలుస్తోంది.