ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసింది. అలాగే ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది. విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25 శాతాన్ని కూడా విడుదల చేయబోమని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల ముగింపు ఈ చర్చల పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని అమెరికా లింక్ పెట్టింది. మరోవైపు ఇరాన్ కూడా చర్చల కోసం ఐదు షరతులను విధించింది. ముఖ్యంగా లెబనాన్‌లో ఘర్షణలు ఆపాలని, తమపై ఆంక్షలు ఎత్తివేయాలని, స్తంభించిన నిధులను విడుదల చేయాలని కోరింది. యుద్ధ నష్టపరిహారంతో పాటు హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని డిమాండ్ చేసింది.
Tag:




Total views : 80566