తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే నెల చివరి నాటికి రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఐకేపీ కేంద్రం, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక పర్యవేక్షక అధికారిని నియమించారు. తరుగు, తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా తగినన్ని తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, లారీల కొరత ఉంటే స్థానిక ట్రాక్టర్లను ఉపయోగించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు
Tag:




Total views : 77482