ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Anganwadi Centers
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్ ల ఆధ్వర్యంలో పట్టణం, మండలాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సచివాలయం సిబ్బంది తో అంగన్వాడీ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ ఇస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్లు చెపుతున్నారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన నాల్గవ రోజు కొనసాగుతోంది. అంగన్వాడీ సిబ్బంది నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడం సిగ్గు సిగ్గు అంటూ అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు.
చాలిచాలని వేతనాలతో తమ కడుపు మండుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనలు చేస్తుంటే తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్ళి తాళాలను పగులగొట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మార్కాపురంలోని 52వ అంగన్వాడి కేంద్ర వద్ద తాళం పగులగొట్టెందుకు వచ్చిన సచివాలయం సిబ్బందిని అడ్డుకున్నారు. అక్కడే కింద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పట్టణంలోని నాలుగు వీధుల్లో నిరసన ర్యాలీ చేశారు.
కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. కనీసం వేతనం ఇవ్వాలని తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని.. అబద్దపు హామీలు ఇచ్చారని.. అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ.. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది, ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం. పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. కనీసం అంగన్వాడి వర్కర్లకు 26,000 జీతం ఇవ్వాలి, ఆయాలకు15000 జీతం ఇవ్వాలి. కర్ణాటకలో, తమిళనాడులో టిఎ డిఏ బిల్లులు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 2015 నుంచి అంగన్వాడీలకు టిఏ బిల్స్ లేవు, మాకు చాలీచాలని జీతాలు ఇస్తూ ఎట్టి చాకిరి చేయించుకుంటూ కూడా సరైన జీతాలు ఇవ్వటం లేదని, అందుకోసమే విధి లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడి సెంటర్లు మూసివేసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలతో సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యమిస్తామని అన్నారు. ఇప్పటికైనా సీఎం గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని రాబోయే ఎలక్షన్లో అంగన్వాడీల ప్రేమాభిమానాలు పొందాలని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలు సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతుందని అన్నారు.
Read Also….
Read Also…
అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కళేబరం రావటం పై ప్రభుత్వం పైన మండిపడ్డ గుంటూరు పార్లమెంటు అంగనవాడి, డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ భాగం.. వైసిపి ప్రభుత్వం అంగన్ వాడి శాఖపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణీ స్త్రీల ప్రాణాలతో ఆడుకుంటుందని, అలాగే అంగన్వాడీలపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు అవసరమైన అవసరాలపై దృష్టి సారించకుండా టిడిపి నాయకుల పైన మా అధినేత చంద్రబాబు, లోకేష్ లపై దృష్టి సారించిందని, గర్భిణీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కలేబరం వచ్చింది అంటే ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అర్థమవుతుందని, ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై దృష్టి సారించకుండా విపక్షాలపై దృష్టి పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అని మండిపడుతున్న గుంటూరు పార్లమెంట్ అంగనవాడి, డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ.
పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడి సెంటర్ కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేస్తున్న నిర్లక్ష్యం బట్టబయలైయింది. చిన్నపిల్లలకు,గర్భిణీలకు పౌష్టికాహారంగా గుడ్లను, పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం. అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లను , పిల్లలకు బాలింతలకు అందిస్తూ గుత్తేదారు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. కాసుల మత్తులో అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కుళ్ళిన గుడ్లతో బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు.. కుళ్ళిన గుడ్లు తింటే పిల్లలకు,గర్భిణీలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. కుళ్ళిన గుడ్లు సప్లై చేస్తున్న సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Total views : 148873