ap news
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది, మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెనీ, వట్రపాలం, మన్నారుపోలూరు రోడ్డు ప్రాంతములలో వరద నీరు వచ్చి చేరుకుంది.
రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలోనే ఆలయానికి చేరుకుని శివ నామస్మరణ చేస్తున్నారు. పంచారామ క్షేత్రాల సందర్శనలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు భక్తులు ఆలయానికి విచ్చేశారు.
అవుకు పట్టణం బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అవుకు మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ అవుకు మండలంలో అత్యధిక ఓట్ల శాతం కలిగి ఉన్న బలిజ సంఘం రాజకీయాల్లోకి రావాలని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. బలిజ సంఘాల కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో కళ్యాణమండపం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే అత్యధికంగా ఇంటి స్థలాలు భూ పంపిణీ కార్యక్రమంలో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. త్వరలోనే ఇంటి స్థలాలతో పాటు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరని ప్రజలు గుర్తించాలని అలాంటి వ్యక్తులకే 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4.12.2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులను తూ.చా తప్పకుండా పాటించవలసిందిగా ఆ ప్రకటనలో ఆదేశించడం అయినది.
భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ (ఇంచార్జ్) కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు, సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు శేషు మాధవి బిజెపి నాయకులు, ఈ సందర్భంగా కురుమద్దాలి ఫణి కుమార్ మాట్లాడుతూ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనదేశానికి ఏ విధమైన ఆటంకం గాని కీడులుగాని జరగవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం.
తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో నెలకొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయకూడదు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులందరినీ ఆదేశించడమైనదని జిల్లా ఎస్పీ శ్రీ S. శ్రీధర్ గారు తెలిపారు.





Total views : 90097