ఉలవపాడు మండలంలోని విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటియో విద్యుత్ వైర్లకు అమర్చిన పింగాణి ఇన్సులేటర్లు డేమేజ్ అవ్వటం వల్ల చిన్న చినుకు పడితే విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుఫాను తాకిడికి వెటర్నరీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో బలమైన చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ వైర్ల పై మరియు విద్యుత్ వైర్లు కింద ఉన్న రేకుల షెడ్డుపై పడగా అందులో నివసిస్తున్న వారు భయభ్రాంతులకు గురి అయ్యి పరుగులు తీశారు. అయితే చెట్టుకొమ్మ వల్ల గాని విద్యుత్ వల్ల కానీఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదు. స్వల్పంగా రేకుల పూరి ఇల్లు దెబ్బతినింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు మండలాధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని చెట్టు కొమ్మను తొలగించి విద్యుత్తును పునర్వదించారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తుఫాను ప్రభావం తగ్గేంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాలలో తలదాచుకోవాలని అధికారులు తెలియజేశారు.
ap news
మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, మచిలీపట్నం మధ్యన తీరం దాటనున్న తుఫాన్. డిసెంబర్ 5 మధ్యాహ్నం తీరం దాటనున్నందున ఐఎండి ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షం సూచన నమోదయ్యే అవకాశం ఉంది. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆంధ్రప్రదేశ్ కు త్రుటిలో తప్పింది, కానీ మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి ఇది ఏపీ దిశగా తీసుకొస్తున్నట్లుగా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపద్యంలో కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇదే సమయంలో మత్స్యకారులు సైతం వేటకు వెళ్ళద్దని గంటకు 110 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం దృశ్య తీర ప్రాంతాన్ని సోమవారం సబ్ కలెక్టర్ శోభిక పర్యటించి తుఫాను ప్రభావం వలన లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో, ఆమె సూచనల మేరకు ఉలవపాడు మండలంలోని కోటిరెడ్డి ఎస్టీ కాలనీ, మన్నేటికోట పంచాయతీ పరిధిలోని తిరుపతమ్మ గుంట, చాకిచెర్ల పంచాయతీలోని ఎస్టీ కాలనీ మరియు కరేడు పంచాయతీలోనిమర్రి చెట్టు సంఘం బాలకోటయ్య సంఘం తదితర గిరిజన సంఘాలలో నీ ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారుల పర్యవేక్షణలోవారికి నీటి వసతి భోజనం వసతి ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాను తీరం దాటే సమయాలలో ఎటువంటి పరిస్థితులలో కూడా ముఖ్యమైన పరిస్థితులలో తప్ప ప్రజలు సురక్షిత ప్రాంతాలను విడిచి బయటకు రాకూడదని తెలియజేశారు
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం తీరాల మధ్యలో తీవ్ర వాయుగుండంగా మారే తరుణంలో, బాపట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత రెండు రోజులుగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన అన్నారు. నెల్లూరు మచిలీపట్నం చీరాల మధ్యలో అంటే బాపట్ల ఉందని ఐఎండి హెచ్చరికల్ని పద్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సముద్రంలో ఎవరూ లేకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఇపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోటానికి బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన బాపట్ల కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా సముద్ర తీరా ప్రాంతాల్లో ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన రెస్క్యూ టీం పోలీస్ శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని ఆ న్నారు.ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితిలు జరిగిన పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎటువంటి సహాయం అందించడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళన గురికాకుండా అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తల దాచుకోవాలని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు. సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి.
తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, కొనకలమిట్ల, పొదిలి, మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా 19 మంది రైతు లబ్ధిదారులకు పట్టణంలోని యస్.సి.బి.సి కాలనీలోని వెలుగు కార్యాలయంలో అసైన్డ్ ల్యాండ్ పట్టాలను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, తాసిల్దార్లు, పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది విఫలమయ్యారు. శ్రీకాళహస్తి జగనన్న కాలనీలో పర్వీన్ అనే మైనారిటీ కి చెందిన మహిళ ఇబ్బందుల్లో ఉన్నానని తెలపడంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా వెంటనే జనసైనికులను పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీకాళహస్తి లో పునరావాస కేంద్రాలు లేవు, ప్రభుత్వం నుండి పట్టించుకునే నాథుడు లేడు అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఒక్క బటన్ నొక్కి తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు. పునరావస కేంద్రం కి తరలించిన వారికి జనసేన నాయకులు బోజన, వసతి ఏర్పాట్లు చేసారు. జనసేన నాయకులకు కార్యకర్తలను తుఫాను బాధితులు అభినందించారు.
సోమారామం లో జనార్ధన స్వామి వార్లను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయం లో వేకువజామునే పవిత్ర కార్తీకస్నానమాచరించి తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆలయంలో నలుమూలల శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రాంగణంలో కార్తీక దామోదరుని స్మరిస్తూ కార్తీక దీపాలు వెలిగించి సోమగుండం చెరువులో వదిలారు. కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి వారికి ఆలయ ప్రధానఅర్చకులు, వేదపండితులు,అర్చకులు రుద్రాభిషేకాలు పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి అశోక్ పిల్లర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్డీటీ కాలనీలోని టిడ్కో గృహాలు వద్దకు తరలివెళ్లారు.





Total views : 90341