పులిచెర్ల మండలం ఎర్రపాపి రెడ్డి గారి పల్లె సమీపంలో మంగళవారం సాయంకాలం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మస్తాన్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మస్తాన్ పశువుల తోలుకొని పొలాల వద్దకు వెళ్లగా గుంపులుగా వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో గత రెండు నెలలుగా ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తున్న వ్యక్తులపై దాడి చేయడం ఇదే మొదటిసారి.. ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు
ap news
శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు గంగల జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈఓ KS రామారావు ఇతర అధికారులు మరియు ఆలయ బోర్డు సభ్యులు పాల్గొని ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం లో అలంకార మండపం వద్ద ఏడు గంగమ్మలకు సారెను వుంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి వేదమంత్రాలు నడుమున సారి ను తీసుకొని నాలుగు మాడా వీధులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తి ఏడు గంగమ్మ గుడి వద్దకు సారెను తెచ్చి ఏడు వీధులలో జాతరను జరిపించే నిర్వాహకులకు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన, నష్టపోయిన ధాన్యం రాశులను, కుండాపోతగా . కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు. వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి ఆయన పారపట్టారు. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం ను ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఎక్కడికి అక్కడే ఓబ్బిడి జరిగేలా కొనుగోలు చేయాలి. భారీ వర్షాలకు కల్లాలపై ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. వరిచేలు నేలకోరిగాయి. ధాన్యం కొనుగోలులో తేమశాతం నిబంధనల సడలింపు వారం రోజుల కిందటే ప్రభుత్వం తీసుకొని ఉంటే రైతాంగం నష్టపోయేవారు కాదు.తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతంలో తీవ్రంగా ఉంటుందని పది రోజుల కిందటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. తుఫాను ఉపద్రవం ముంచుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తేమ శాతం నిబంధనలు సడలించడం, ప్రత్యేక అధికారులను నియమించడం వలన జరిగిన నష్టాన్ని తీర్చలేము. తుఫాను ప్రభావ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందువలనే రైతులతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఇతర వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు..
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు. జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు. తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా, వీరమహిళలు, జనసైనికులతో 2,000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు.
శ్రీవారి అనుగ్రహంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నదని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబరు 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు, గత రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన, పాలకాయతిప్ప, ఉంటగుణం, రామకృష్ణాపురం. బసవన్నవానిపాలెం, పిండి వాని దెబ్బ , పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి, అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరాలస కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి పునరావాస కేంద్రాని పరిశీలించారు. కేంద్రాల్లోని ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు పునరాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో వల్ల ఎవరు ఆ ధైర్యం పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పుడుకప్పుడు అధికారి యంత్రంగానికి సూచనలిస్తూ అవసరమైన సదుపాయాలను సమకూర్చటం జరిగిదని అన్నారు
వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 40 కాసుల బంగారం,1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు. తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు. చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ, మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబు, ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు.
అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె, చిన్న ఓరంపాడు, ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. నష్ట తీవ్రతను గుర్తించి రైతులను అడిగి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందేలా చూస్తామన్న కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారితో పాటు రాజంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్రబాబు, పుల్లంపేట తహసిల్దార్ నరసింహ కుమార్ తో పాటు ఓబులవారిపల్లె తహసిల్దార్, ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..
నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచోంగ్ తుఫాను పాకల, ఊళ్లపాలెం సముద్ర తీరాలలో బలమైన గాలులు వీస్తూ ఉవ్వెత్తుతున్న కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఇసుక మేటలు వేస్తూ ప్రమాదకరంగా సముద్ర తీరం మారిపోయింది. ఇప్పటికే ఎన్ .డి. ఆర్. ఎఫ్ బృందాలు పాకల గ్రామంలోకి చేరుకున్నాయి. జాలర్లు వేటకు వెళ్లకుండా ci దాచేపల్లి రంగనాధ్ వారి సిబ్బంది, మెరైన్ పోలీసులు గస్తీ తిరుగుతూ పహారా కాస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు గుర్తించి అక్కడ వారిని ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు.






Total views : 90557