పెను తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్త లతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశాం. ఈ గొప్పదనం జిల్లా యంత్రాంగానికి చెందుతుంది. గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్టమైన టీమ్ వర్క్ ఏపీ లో ఉంది. వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు సత్వర సాయం అందిస్తాం. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఆర్థిక సహాయం చేసాం. పంట దెబ్బతిన్న రైతులని ఆదుకుంటాం. అంచనాలను సిద్ధం చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో పంట నష్టమైతే దాదాపుగా జరగలేదు.
ap news
అనంతపురం జిల్లాలో సీఐ హామీద్ ఖాన్ పై బాధితులు త్రీవ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి పట్టణం లోని సీపీఐ కాలనీలో నివాసం ఉండే రామగుర్రప్పను ఒక ఘర్షణ విషయంలో పోలీస్ స్టేషన్ కు పిలిపించి కరెంట్ తో షాక్ పెట్టడం జరిగిందన్నారు. షాక్ పెట్టడంతో ఇప్పుడు తన విధి నిర్వహణ డ్రైవింగ్ కు వెళ్ళలేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామన్నారు. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రావడం జరిగిందని బాధితుడు తెలిపారు.
ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్య లక్ష్మిలు, రాష్ట్ర కమిటి ఉత్తర్వుల మేరకు ఈ నెల్ 8 నుంచి అంగన్వాడి సమస్యల పరిష్కారానికై డిసెంబెర్ 8 నుండి జరిగే అంగన్ వాడి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు .ఈ ర్యాలి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదగా వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మనవహరంగా నిలబడి అంగన్వాడి సమస్యల పరిష్కరించడమే కాకుండా పెండింగ్ లో నున్న వేతనాలు టి ఎ ,డి ఎ లు కూరగాయల బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారు నినాదాలు తెలియజేశారు .అక్కడ నుంచి ప్రభుత్వ సముదాయాల దగ్గర నున్న రాజ్యాంగ సృష్టి కర్త బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం డా.. బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి వారి నిరసనను తెలియజేశారు .అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు అక్క చెల్లమ్మల అందరికి తోడుగా ఉంటానన్న జగనన్న మా అంగన్ వాడి అక్క చెల్లమ్మల కు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం చాల దురదృష్టకరం అన్నారు .నెల నెల వేతనాలు రాక అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు.అదే విదంగా గర్బవతులకు ,బాలింతలకు ,అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం కు కావాల్సిన గ్యాస్ కూరగాయలు ఇతర సరుకుల కోసం ఖర్చు చేసిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో వర్కర్లు అంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .రాష్ట్రంలో సుమారు 70 శాతం సెంటర్లు అద్దె భవనలలోనే కొనసాగుతున్నాయన్నారు .అద్దె బిల్లులు కుడా సక్రమంగా రాకపోవడంతో భవనాల యజమాను దారులు నుండి అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడిలు అధికం అయ్యాయన్నారు.వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారం కుడా సక్రమంగా పంపిణి కాకపోవడంతో లబ్ది దారులకు సరైన సమయంలో పంపిణి చేయలేక పోతున్నమన్నారు .ఎంటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలో నున్న ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) ఇతర కార్మిక సంఘాల మద్దతుతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉఉపాధ్యక్ష రాలు ఖాజాబి, కోశాధికారి బంగారు పాప, రాయచోటి అధ్యక్షురాలు సిద్దమ్మ తో పాటు రాయచోటి ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి లీడర్లు, వర్కర్లు, హేల్పర్లు పాల్గొన్నారు
తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు ముఖ్యమైన రహదారని, పూర్తి గా దెబ్బతినకముందే రక్షణ చర్యలు చెపట్టి ఆధునికీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరించి రైతు జీవితాలతో ఆడుకుందని దుయ్యబెట్టారు. గత ప్రభుత్వంలో వెంటనే వ్యవసాయ అధికారి ను గ్రామాల్లోకి పంపించి నష్టం నివారణ ఎక్కువ జరక్కుండా తగు చర్యలు తీసుకున్నామని, కానీ నేటి ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోగా కనీసం నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయటం లేదని ఎద్దేవా చేశారు. వదిలేసిన రైతులు సుమారు 50 వేల రూపాయలు నష్టపోయినట్టు, మెత్త పైడ్ చేసిన ఒక్కొక్క రైతు సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్టు రైతులు తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కింద వడివేసిన రైతులకు సుమారు 40000 రూపాయలు, మెట్ట పైరు వేసిన రైతులకు 70 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరంటీల్ ద్వారా నిజమైన నష్టపోయిన రైతులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నష్టం నివారణ నగదు వెళ్లిందని, కానీ నేడు అలా జరిగితే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకో చెయ్యిల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నేలకొరిగి నీట మునగడంతో రంగు మారే అవకాశం ఉందని, ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు…
తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరి పంట అధికంగా నీట మునిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు.
తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. 25 మండలాలలో వర్షం కురిసిందని, 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కేవలం రెండోచోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయని, రెండు గోడలు కూలి నాలుగు గొర్రెలు చనిపోయాయన్నారు. 32 ఇళ్లు దెబ్బ తిన్నాయని, 37 గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 350 స్తంభాలు పడిపోయాయని, రాత్రి రెండున్నర గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు రోడ్లమీదనే ఉండి విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 90 శాతంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. పర్చూరు సబ్ స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పనులు జరుగుతున్నాయన్నారు. అధికంగా సూర్యలంక, ఓడరేవు ప్రాంతాలలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,319 మందికి ఆశ్రయం కల్పించామని కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు.
2,500 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం సాయంత్రానికి వారిని ఇళ్లకు పంపుతామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్తున్న వారికి ప్రభుత్వం నిర్దేశించినట్లు ఐదు వస్తువులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 70 వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగిందని, పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా ఈ పనులు చేపట్టామన్నారు. ప్రతి మండలానికి ప్రోక్లైన్లు, జెసిబి యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించామని, రూ. 25 లక్షలు నిధులు ఇచ్చామన్నారు. బాపట్లలో అధికంగా పండే ధాన్యం, శనగ, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటల నష్టం అంచనాల సర్వే పనులు మొదలయ్యాయన్నారు. కారంచేడు, మార్టూరు, పర్చూరు మండలాలలో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు. తీర ప్రాంతంలో వలలు, బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 93 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. గేదెలకు అంటూ వ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు.తుపాను నష్టంపై మూడు రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు.
చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం. రెండు రోజులుగా కరెంట్ లేక సతమతం ప్రజలు అవుతున్నారు. సాయంత్రం నాలుగు ఐదు గంటల లోపు కరెంట్ ఇస్తామని చెప్పిన విద్యుత్ శాక అధికారులు మాట తప్పారు. నీరు రాక, మొబైల్ ఫోన్లలో చార్జింగ్ లు లేక, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలిలేక బాలింతలు, పసిబిడ్డలు, ఇబ్బందులు పడుతున్నారు. కరంటు కొన్ని చోట్లకే పరిమితమైనది. అత్యవసర శాకగా ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన వైనం. సెంట్రల్ లైటింగ్ లకు కరెంట్ ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకున్నారు . కరంట్ డిపార్ట్మెంట్ అధికారులు దొరికితే నడి రోడ్డులో నిలదీస్తామని ఆగ్రహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో అన్నవరం పంపా నదిలో పెను సుడిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.సుడిగాలి బీభత్సంతో అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్ వెంబడి చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి. కొండపై సుడిగాలి కి రామాలయం వద్ద షెడ్ రేకులు ఎగిరి పడ్డాయి. ఎగిరిన రేకులు పడటంతో ఇద్దరు మహిళా భక్తుల కు గాయాలయ్యాయి. చికిత్స కోసం తుని ప్రభుత్వ ఆస్పత్రికి దేవస్థానం సిబ్బంది తరలించారు. విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతోఅన్నవరం, చుట్టుపక్కల ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు.






Total views : 90582