శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి. దీనితో నీటి కుక్కల కళ్ళను చూపుర్లను కట్టిపడేస్తున్నాయి. నీటి కుక్కలు ముఖ్యంగా ఎగువన వర్షాలు పడినప్పుడు నీళ్లు పెరిగిన, లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గిన శ్రీశైలం జలాశయం పరిసరాలలో చేపల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి. అలానే ప్రతి సంవత్సరం శ్రీశైలం పాతాళగంగలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసుకున్న జెట్టుపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. నీటి కుక్కలు సాధారణంగా మనిషి కనపడిన శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో నీటి కుక్కలు శ్రీశైలంలోని పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర టూరిజం శాఖ జెట్టుపై ఒక్కసారిగా ప్రత్యక్షమై కనపడంతో యాత్రికులకు కనువిందు చేసాయి. అయితే యాత్రికులు సైతం తమ సెల్ ఫోన్ లో నీటి కుక్కల సందడిని చిత్రీకరించారు. నీటి కుక్కలు పాతాళగంగకు వెళ్లే వారికి వీటిని చూస్తూ ఆనందంతో పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టారు.
ap news
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం, 1:50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలు కొరకు తమ బంధువుల ఇంటికి వచ్చి వారితో సంప్రదింపులు జరిపి మధ్యాహ్నం భోజనం స్వీకరించారు. అనంతరం రాయచోటిలో ఏర్పాటుచేసిన డీయస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేసి వెంకటేష్ ని అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లిపోవడంతో కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు మోటార్ సైకిల్ సహాయంతో రోడ్డు మార్గంలో ఉన్న ప్రొటెక్షన్ సెంటర్ వద్దకు వెంకటేష్ చేరుకోగా, తీవ్రంగా రక్తస్రావ గాయలతో ఉన్న వెంకటేష్‌ను హుటాహుటిన సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ కు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తున్న అటవీశాఖ అధికారులు వైద్యులు తెలిపారు.
ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, ఆయిల్, పప్పు లు పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు, ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000 రూపాయలు, ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూధన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ చలపతి రాజు, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపీటీసీ రమేష్ రాజు,స ర్పంచ్ కిరణ్ నాయుడు విఆర్ఓ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు _ నారా చంద్రబాబు నాయుడు_ శుక్రవారం బాపట్ల పర్యటన కి రాబోతున్నారు. శుక్రవారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల నియోజకవర్గం లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి అనంతరం రాత్రికి బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బస చేసి శనివారం ఉదయం బాపట్ల నుండి బయల్దేరి పర్చూరు నియోజకవర్గం వెళ్తారు అని నరేంద్ర వర్మ తెలిపారు..
తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను,జగనన్న కాలనీలను పరిశీలించారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు. సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి ..కంద,పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మరియు మంత్రివర్యులు బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి నాగార్జున తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు మీకు చేతనైంది మీరు చేయండి అనే ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం చేసె గుణం మా ముఖ్యమంత్రి ది ప్రతి రైతుకు రైతు భరోసా కౌల రైతులకు భరోసా ఇన్పుట్ సబ్సిడీ పంట రాష్ట్ర పరిహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వ్యవసాయ సలహాలు ఇస్తున్న వ్యవసాయ సిబ్బంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మాది మాట్లాడే ముందు మీరు ఏం చేశారు అనేది తెలుసుకోండి. ఇప్పుడు చేతనైతే సహాయం చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం చేద్దాం ఇప్పుడు ప్రజలకు మేలు చేద్దాం చేతనైతే మేలు చేయండి అని ఆనంద్ బాబుకు ఇతవు పలికారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన పోల హేమంత్ (20)గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తిరుమల రాజు ఉన్నారు వీరి ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డా,, బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని, అందుకే జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అన్నారు. పేదల పక్షపాతి సీయం జగన్ అని కొనియాడారు. విద్యావిధానం రాష్ట్రం లో మంచిగా అమలు అవుతుందని, ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఇవాళ ఈ రాష్ట్రం లో ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల పై నారాయణ స్వామి స్పందిస్తు…తెలంగాణలో ఒక మతం పైనే అక్కడి రాజకీయం ఈ ఎన్నికలలో జరిగిందని, కేవలం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు, ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరే లేది కాదని ఎద్దేవా చేసారు. అభివృద్ధి ని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు అని ఆరోపించారు.ఇదంతా ఎల్లో మీడియా, చంద్రబాబు ప్లాన్… రేవంత్ రెడ్డి ఇప్పటి కీ టీడీపీ మనిషే అని ఆరోపించారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయని, తిరుపతి కాళహస్తి, గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని వాళ్లకి సహాయ చర్యలు జరుగుతాయని అన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఎక్కవుగా పంట నష్టం జరిగిందని వాళ్లకి అంచనా వేసి త్వరలో నష్ట పరిహారం చెల్లిఇస్తాం అన్నారు నారాయణ స్వామి. రైతులను ఆదుకుంటామని 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి.






Total views : 90599