వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానికులు వాలంటీర్లుగా ఏర్పుడి ఉత్సవాల నిర్వహణ చూసుకుంటున్నారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకల నేపథ్యంలో 10వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ పి.విశ్వ ప్రసాద్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు. ఆర్అండ్బి కార్యాలయం, నేచర్‌క్యూర్ ఆసుపత్రి, జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్మెంట్స్ నేచర్‌క్యూర్ ఆసుపత్రి రోడ్ సైడ్ వైపు, ఫతేనగర్ రైల్వే వంతెన కింద, పద్మశ్రీ అపార్ట్మెంట్స్ నుంచి ఆర్ అండ్ బి కార్యాలయం వైపు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సహాయం కోసం 90102 03626 కు ఫోన్ చేయవచ్చని ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62166