మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈవాళ మ.2:15 గంటలకు హైకోర్టు విచారించనుంది. నిన్న జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని రాష్ట్ర బ్రూవరీస్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర వేర్వురుగా హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా చంద్రబాబు తరఫున న్యాయనాది నాగముత్తు వాదనలు వినిపించారు.
chandrababu
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హైకోర్టు నమ్మింది కాబట్టే, ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారని కందుకూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. అక్రమ కేసు పెట్టించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలోని కృష్ణుడి గుడి ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ మినీ మేనిఫెస్టోకు సంబంధించిన పథకాలను స్థానికులకు వివరిస్తూ నాగేశ్వరరావు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారన్న భావన ప్రజల్లో మొదటి నుంచి ఉందన్నారు. అయితే వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆయనకు బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశారని అన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదన్న బాధలతో హైకోర్టు ఏకీభవించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో వైసీపీ నేతలు ఎన్నో దుష్ప్రచారాలు చేశారని, అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. , జగన్ అరాచక పాలన పైనా, జనసేనతో కలిసి ఆయన పోరాటం సాగిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలంతా ఆయనకు అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలపాలని నాగేశ్వరావు కోరారు.
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది.అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్టైన వారెవరూ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జైలులో ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే 52 రోజులపాటు జైలులో ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అనారోగ్య సమస్యలను సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం మరోవైపు గుండె పరిణామం పెరగడం ఇలాంటి కారణాల దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.
గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 2019 ఎన్నికలలో పురందేశ్వరి పెర్ఫార్మెన్స్ పై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని కొడాలి ఎద్దేవా చేశారు. తండ్రి మరణానికి కారణమైన పురందేశ్వరి ఇప్పుడు టీడీపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురింధేశ్వరికి వాటాలు అందాయి. అప్పుడు నోరు మూసుకున్నపురందేశ్వరి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతుంది. వైసీపీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అంటూ కొడాలి నాని హెచ్చరించారు.
Read Also..
Read Also..
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు , వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా , కొత్త రోడ్లు వెయ్యలేదు ,కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
సీఎం జగన్ అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మద్యం అమ్మకాలు, నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలో మద్యంపై కేవలం 50 వేల కోట్లు ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధరలు పెంచడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయని చెప్పారు కానీ ఎక్కడ తగ్గలేదు. మద్యనిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఊరూవాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిరుపేదలకు డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే జరిగింది మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన మేనిఫెస్టోపై కమిట్ మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు.
Read Also..
Read Also..
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కాబట్టి ప్రజలు కూడా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వైఎస్ జగన్ నిరంతరం పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదని చెప్పుకొచ్చారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి కావాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 2024లో పేదలకు-పెత్తందారులకు ఎన్నికలు జరుగుతున్నాయని పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైఎస్ జగనే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.





Total views : 89850