కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు ఉంచారని బిజెపి నాయకులు ఆందోళన చేయడం జరిగింది, ఈ విషయంపై దేవస్థానం చైర్మన్, ఈవో వివరణ ఇవ్వడం జరిగింది, నవ్య అనే మహిళ తన ఇంటిలో ఉన్న దేవుల్లా ఫోటో ఫ్రేమ్ విరగడంతో ఉంచకూడదని కారణం చేత దేవస్థానం సన్నిధిలో ఉంచానని వేరే కారణం అంటూ ఏమీ లేదుఅని తెలియకుండా తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది, ఈ విషయంపై దేవస్థానం ఈవో తెలియకుండా పొరబాట్లు కొన్ని జరుగుతుంటాయి, దేవస్థానం పవిత్రతను కాపాలని అందరూ సహకరించాలని కోరడం జరిగింది.
chittoor district news
అంతర్రాష్ట్ర దొంగలను చేకచక్యంగా పట్టుకున్నారు మదనపల్లి పోలీసులు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వీరి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని అమాక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు ముఠా సభ్యుల ను మదనపల్లి పోలీసులు ఎట్టకేలకు కటకటాలలోనికి పంపారు. మా భూమిలో లంకె బింద దొరికింది, బయట విక్రయించాలంటే వివిధ శాఖల అధికారులతో సమస్యలు ఉంటాయని, కుటుంబ అవసరాల కోసం గుట్టుగా బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని నమ్మించి నకిలీ బంగారు పూసలు ఇచ్చి ఘరానా మోసానికి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మదనపల్లి ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ బంగారం సెల్ ఫోన్లు సీజ్ చేసి ఏడుగురని అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి, కేశప్ప, సీఐ మహబూబ్బాషా తెలిపారు.
చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి, కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు
టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి, జనసేన నేతలు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తమ అధినేతకు అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని, ఎలాంటి అవినీతి చేయిని చంద్రబాబు నాయుడు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని, అధికారి పార్టీ గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం మేధో గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపట్టాన్ని , ప్రసాదాలను అందించారు
స్థిరాస్ల వ్యవహారంలో సివిల్ కోర్టుల పరిధిని మినహాయించి ట్రిబ్బినల్స్ ఆశ్రయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ఆఫ్ 2023 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పలమనేర్ న్యాయవాదులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు పలమనేరు భారసోసియేషన్ అధ్యక్షులు కే లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పలు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నూతన చట్టం ప్రకారం రైతులు నివాస స్థలాలు యజమానులు తీవ్రంగా నష్టపోతారని స్థానికంగా అందుబాటులోని సివిల్ కోర్టు లను ఆశ్రయించే అవకాశాన్ని కోల్పోతారని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంలోనే సంబంధిత అధికారులు హక్కులను నిర్ణయించే విధంగా ఈ చట్టం ఉందని సెక్షన్ 38 ప్రకారం పూర్తిగా స్థిరాస్తి హక్కులపై సివిల్ కోట్లను ఆశ్రయించుటకు వీలులేదని తెలిపారు. స్థిరాస్తులపై తమ హక్కులను కాపాడుకోవడానికి జిల్లా స్థాయిలో ట్రిబ్బినల్స్ ను ఆశ్రయించాల్సి వస్తుందని దాని తర్వాత రాష్ట్ర స్థాయి ట్రీబ్బినల్సుకు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఈ చట్టం వలన రైతులు స్థిరాస్తి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కె లక్ష్మీపతి కుప్పరాజు పరమశివప్ప ఎల్ భాస్కర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు
కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను
తిరుపతిలో క్రికెట్ క్రీడాభిమానులకు ఆంద్రా క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా బాయ్స్, అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తీపి కబురు అందించారు. ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు అతిపెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర క్రీడా మైదానంలో మధ్యాహ్నం 1 గంటల నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 12 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు కలిగిన అతి పెద్ద స్క్రీన్ లు, డీజే సౌండ్స్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశామని, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలను అభిమానులు అందరూ ప్రశాంతంగా వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సుమారు 7 వేల నుంచి 10 వేల మంది ఒకే చోటు నుంచి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడకు వచ్చిన క్రికెట్ అభిమానులు అందరికీ ఉచిత ప్రవేశం, రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆనందంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక ఆహ్వానితులు తుడా చైర్మన్ చెవి రెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టనుంది. తిరుమల శ్రీవారిని నిన్న 70,686 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం..3.02 కోట్లు కగా ..శ్రీవారికి తలనీలాలు 34,56 3భక్తులు సమర్పించుకున్నారు…34,563 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) శనివారం ఉదయం 12.10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది. దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు. దీనికోసం తిరుచానూరు సర్పంచ్ కె.రామచంద్ర రెడ్డి సుమారు 9 సంవత్సరాల నుండి ప్రతి యేటా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రాత్రి 7000 మందికి అల్పాహారము, ఉదయం 10,000 మందికి అల్పాహారము, మధ్యాహ్నం భారీగా 25 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు





Total views : 90047