తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న
67,140 భక్తులు దర్శించుకున్న భక్తులు..నిన్న హుండీ ఆదాయం..4.01 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26,870 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది
chittoor district news
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు..తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకపూజలు చేసి ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాలుగు మాడవీధులలో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి మెట్ల మార్గం గుండా తిరుపతికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. మధ్యహ్నం 12:00 గంటలకు జరగనున్న పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ పూజ కార్యక్రమంలో పసుపు-కుంకుమ సారెను అర్చకులు అమ్మవారికి అలంకరిస్తారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం నుంచి తీసుకెళ్లే సారుకు ఎంతో విశిష్టత ఉందని, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసిందని భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించాలని అన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
Read Also…
Read Also…
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కు చెందిన బండ్లపల్లి గ్రామంలో రజక కులానికి చెందిన వృద్ధురాలు మంగమ్మ కుమారుడు మల్లికార్జున అదే గ్రామంలో ఉన్న వడ్డీ వ్యాపారి ఉదయ్ కుమార్ రెడ్డి వద్ద నుండి కుటుంబ పోషణకు కొంత సొమ్ము అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆ వడ్డీ వ్యాపారి చెవిటి వృద్ధురాలిని బయటకు పంపి ఇంటికి తాళాలు వేశాడు. ఇంటికి తాళాలు తీయమని ఎంత వేడుకున్న తీయడం లేదని బోరున విలపిస్తున్నది.. తన కుమారుడు కుటుంబంతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లినట్లు వృద్ధురాలు తెలిపింది. త్వరలో డబ్బు పంపిస్తామని చెప్పినా వినకుండా ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు(సీనప్ప) అనే ఇద్దరు వ్యక్తులు తన ఇంటికి తాళం వేసినట్లు కన్నీరు మున్నీరు అయింది. నెల రోజుల నుండి సరైన తిండి తిప్పలు లేకుండా చలికి వణుకుతూ బయటే నిద్రిస్తున్నట్లు వృద్ధురాలు కన్నీరు పెట్టుకుంది. ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచక ఇంటి బయటే కూర్చున్న వృద్ధురాలి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. మానవత్వంతో అధికారులు, నాయకులు స్పంది చి న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నది.
Read Also…
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆదాయం కోసమే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉండడంతో అధికారుల తీరును పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వామివారి ప్రచారం పేరుతో మునుపెన్నడూ లేని విధంగా వారణాసి, ఋషికేసి లాంటి అత్యధిక దూర ప్రాంతాలకు సైతం అధికారులు సతీ సమేతంగా వెళ్లి అక్కడ స్వామి వారి పూజా కార్యక్రమాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల రెండు కోట్ల లోపుగా ఆదాయం వచ్చే దేవాలయాల్లో కాణిపాకం దేవస్థానం ఒకటి.. ముఖ్యంగా ఐదు కోట్ల రూపాయల మేర భక్తుల నుంచి ఆదాయం సమకూరే శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, లాంటి ఆలయాల ఖర్చుతో పోల్చుకుంటే గత మూడు సంవత్సరాలుగా కాణిపాకం దేవస్థానానికి భారీగా ఖర్చును లెక్కల్లో చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు కోటి రూపాయల వరకు పాలకమండలి, ఉన్నత అధికారులు, దూర ప్రయాణాల పేరుతో ఖర్చులు అయ్యాయి అనేది అక్షర సత్యం… మరోవైపు దేవస్థాన అధికారులకు స్వామి వారి సొమ్మును ఖర్చు చేసే అధికారం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులకు సైతం యాత్రలకు తీసుకు వెళుతూ భారీగా భక్తుల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు సైతం భక్తులు అందజేస్తున్న విరాళాలు, వాటి ఖర్చు వివరాలను ప్రతి ఆలయం వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాణిపాక దేవస్థానం అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆలయ పునర్నిర్మాణ దశలో సైతం దాత అందజేసిన దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు, కుంభాభిషేక సమయంలో భక్తులు అందజేసిన లక్షల రూపాయల విరాళాలు, బంగారు (తాపడం) ధ్వజస్తంభం ఏర్పాటు కోసం భక్తులు విరాళాలను అందజేసిన లక్షల రూపాయలు వీటన్నిటికీ కూడా దేవస్థాన అధికారుల వద్ద లెక్కలు లేవు.. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా ఖర్చుల రూపేనా లక్షల రూపాయలు చూపుతున్న అధికారులు ఆదాయంగా వచ్చిన నిధులు ఏ మేర ఖర్చు పెట్టారు శ్వేత పత్రం విడుదల చేయాలని స్థానిక ఉభయదారుల వ్యవస్థ ప్రశ్నిస్తోంది…. అంతేకాకుండా కేవలం ధనార్జనే లక్ష్యంగా కాణిపాక ఆలయం వద్ద అభివృద్ధి పనులు సాగుతున్నాయి. 50 లక్షల రూపాయల వ్యయంతో వేసిన రోడ్డు సైతం మూడు నెలల్లోనే నిర్వీర్యం అయిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు. కాణిపాక దేవస్థానం వద్ద నిధుల దుర్వినియోగం తో పాటు వడ్డించేవాడు మనవాడైతే అనే చందన వసతి గదులు, టెండర్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల సేకరణ సైతం భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్వామి వారి సొమ్మును రక్షించి పొదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం భారీగా ఖర్చు చేస్తున్నడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర స్థాయి అధికారులు కాణిపాక దేవస్థానం పై నిర్లక్ష్యం చూపడంతోనే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మరోవైపు బలంగా ఆరోపణలు ఉన్నాయి
శనివారం తిరుచానూరు వైపు వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటుంది. శుక్రవారము రాత్రి 12:00 గంటల నుండి సింధు కూడలి నుంచి తిరుచానూరు లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతిలేదు. అప్పటి నుండి ట్రాఫిక్ మళ్ళింపు అమలులో ఉంటుంది. దయచేసి స్థానిక ప్రజలు గమనించగలరు. శనివారం ఉదయం అమ్మవారి పంచమి చక్ర స్నానం పూర్తి అయ్యేవరకు తిరుచానూరు నుండి బయట వైపు మరియు లోపలికి వైపుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. 18-11-2023 శనివారం ఉదయం జరిగే పంచమి తీర్థానికి వచ్చే ప్రతి ఒక్కరు ప్రత్యేకము గా ఏర్పాటు చేసిన మూడు హోల్డింగ్ పాయింట్స్
- పూడి,
- Z.P.High School
- నవజీవన్ హోల్డింగ్ పాయింట్ ల నుండి క్యూలైన్ల ద్వారా 4 వ గేటు నుండి మాత్రమే పుష్కరిణి లోనికి ప్రవేశం కల్పించడం జరుగుతుంది
పంచమితీర్థం కు తిరుపతి నుండి వచ్చే భక్తులు తమ నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్ యార్డ్, తనపల్లి క్రాస్ నందు, ద్విచక్ర వాహనాలు శిల్పారామం, వార్తా క్రాస్ వద్ద గల పార్కింగ్ నందు పార్క్ చేసి అక్కడ నుండి నవజీవన్ వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. తమిళనాడు నుండి పూడి మీదుగా వచ్చే భక్తులు పాడిపేట వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో వారి వాహనాలను ఉంచి కాలినడకన గోశాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా పుష్కరిణిలోనికి చేరవల్సి ఉంటుంది. నారాయణాద్రి ఆసుపత్రి, గాజులమండ్యం మరియు రేణిగుంట వైపు నుండి వచ్చే భక్తులు వార్త క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను ఉంచి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. చిత్తూరు వైపు నుండి వచ్చే భక్తులు తనపల్లి క్రాస్ వద్దనున్న హోటల్ తాజ్ ఎదురుగా ఉన్న గల పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. పూడి రోడ్డు మార్గం వైపు గల అన్ని గ్రామాల ప్రజలు మరియు ఆ దారిలో వచ్చిన వాహన దారులు పాడిపేట పెట్రోల్ బంక్ కు ఎడమ వైపు నుండి ముండ్లపూడి గ్రామం మీదుగా తనపల్లి గ్రామం కు చేరుకుని, అక్కడి నుండి తాజ్ హోటల్ మార్గం గుండా తిరుపతికి చేరుకోవాలి అలాగే తిరుపతి నుండి పూడి మార్గం వైపు వెళ్లే ప్రజలు పై విధంగానే వెళ్లాల్సి ఉంటుంది. యోగిమల్లవరం, ముత్తునగర్, ప్రశాంతి నగర్, ఎస్వీపి కాలనీ,వసుంధర నగర్, వైష్ణవి నగర్, పొన్నకాల్వ, చంద్రశేఖర్ కాలనీ ప్రజలు తాజ్ హోటల్ మార్గం ద్వారా బైపాస్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుండి తిరుపతి వైపుకు చేరుకోవాలి. నేతాజీనగర్, రంగనాధం వీధి, కుంటిగంగమ్మ వీధి, సమాజం వీధి, సన్నిధివీధి, శంకర్ నాయుడు కాలనీ వాసులు వార్త క్రాస్ ద్వారా తిరుపతికి చేరుకోవాలి. చక్రస్నానం పూర్తయ్యేంత వరకు సింధూ జంక్షన్ నుండి తిరుచానూరు కు, తిరుచానూరు నుండి పూడికి ఎలాంటి వాహనాలను అనుమతించబడదు కావున 18వ తేదీ పంచమితీర్థం రోజున తిరుచానూరు ప్రజలు గ్రామంలో ఎలాంటి వాహనాల పై తిరగకుండా పోలీసు వారికి సహకరించ వలసినదిగా విజ్ఞప్తి. భక్తులకు ముఖ్యమైన గమనిక:- పుష్కర పుణ్య స్నానమునకు వచ్చు వారు విలువైన ఆభరణములు ధరించి రావొద్దు. మీ యొక్క విలువైన వస్తువులు,సెల్ ఫోన్ లను జాగ్రత్త గా ఉంచుకోవాలి. పిల్లలు, వృద్దులను తీసుకుని వచ్చు భక్తులు, వారిని జాగ్రత్త గా తోడుగా వుండాలి.
Read Also…
గంజాయి అక్రమ అమ్మకాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ… స్మగ్లర్లు మాత్రం ఏదో విధంగా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. పీడీ యాక్టులు ప్రయోగించినా ఫలితం లేకుండా పోతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజురోజుకు గంజాయి అమ్మకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ అమ్మకాలపై సెబ్ అధికారుల దాడులు నిర్వహించారు. వెంకటగిరి పట్టణం అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ఆరవ రమణయ్య, రవణమ్మ అనే దంపతుల ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 35 వేల రూపాయల విలువగల కేజీ 600 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేశామని సెబ్ సిఐ తెలిపారు. గంజాయి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.
పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
తమిళనాడులో మృతి చెందిన చిరుత పులి.. మృతిచెందిన చిరుతపులిను ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వేసి వెళ్లిన తమిళనాడు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ తమిళనాడులో మృతి చెందిన చిరుతపులిని ఆంధ్రలో వేయాల్సిన అవసరం ఏమి అని ప్రశ్నించారు, చిరుతపులిని వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ అన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఆంధ్ర ఫారెస్ట్ అధికారులకు తమిళనాడు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఏనుగులు విషయంలో గొడవలు పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి… .చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో అటవీ మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం దాటక మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెంది రోడ్డు మధ్యన పడి ఉంది..అటుగా వెళ్లిన వాహనదారులు చిరుత మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు.. పలమనేరు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతపులిని పోస్టుమార్టం చేసేందుకు తరలించారు.మృతి చెందిన చిరుతకు పదేళ్ల వయసు ఉంటుందని ఆడ చిరుతగా గుర్తించారు..ఇంత వయసు ఉన్న చిరుత ఒంటరిగా ఉండే అవకాశం ఉండదని తోడుగా మరో చిరుత ఉండే అవకాశం ఉంటుందని అడవి శాఖ వారు భావిస్తున్నారు..అనంతరం చిరుతపులిని పోస్ట్‌మార్టం చేసి దహనం చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు.ముడిసరుకుల నిల్వకు అలిపిరి వద్ద రూ. 11 కోట్లతో గోడౌన ను నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళం-రేణిగుంట రోడ్డుకు రూ. 15 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.పుదిపట్ల జంక్షన్-వకుళామాత గుడి వరకు రోడ్డుకు రూ. 21 కోట్లు కేటాయించామన్నారు.ఆయుర్వేద ఆసుపత్రిలో రూ. 1.65 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రుయాలో టీబీ రోగులకు రూ. 1.79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ నవీకరణ పనులు చేపడతామన్నారు. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. దీనికి కోసం మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నామని భూమన వెల్లడించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 6850 రూపాయలు ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15.54 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.





Total views : 90017