చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగు ఏనుగుల శిబిరం నుంచి మన్యం జిల్లా పార్వతీపురానికి గజరాజులను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో ఈ తరలింపును చేపట్టారు. ఏనుగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వైద్య బృందాలు, అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు నిర్వహిస్తున్నారు. గజరాజులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు అటవీ సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తరలింపు ప్రక్రియను దశలవారీగా పూర్తి చేసి ఏనుగులను సురక్షితంగా పార్వతీపురంలోని నిర్దేశిత ప్రాంతానికి చేర్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Tag: