సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాతను మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తంకుమార్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని సర్పంచులు వారి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బారస ప్రభుత్వం ను తరిమి కొట్టాలిసిన సమయం వచ్చింది.. Mla నుంచి సీఎం దాకా రాష్ట్రమును దోచుకున్నారు..నవంబర్ 3 న కాని అంతకు ముందు కాని రైతు బంధు ఇవ్వాలని చూచించాను… కానీ కేసీఆర్ మాత్రం మాట మార్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వవద్దని అనడం హాస్యాస్పదం.. స్థానిక mla వైన్స్ మీద కూడా కమిషన్ తీసుకొని దోచుకుంటున్నారు.. దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్పాను.. దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా mla మాత్రం 300 ఎకరాలు దోచుకున్నాడు… ప్రభుత్వం అన్ని రకాల వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసింది… 6నెలల క్రితం చెప్పిన హుజుర్ నగర్ నుంచి 50 వేల మెజారిటీ వస్తుందని.. డిసెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు కైవసం చేసుకుంటుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాము… కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షల ఇండ్లు కట్టించినము..ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తాము… మీరే మాకు కుటుంబ సభ్యులు, మీరే మాకు పిల్లలు.. 24 గంటలు ప్రజల కోసం పాటుపడుతున్నాము… 5 సార్లు mla గా ప్రస్తుతం ఎంపీ గా ఉన్న 6వ సారి mla అవుతా చిన్నదో,పెద్దదో పదవి వస్తుంది..అందరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తాను… నేను ఏ ఒక్క రోజు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.. బై బై కేసీఆర్, బై బై సైదిరెడ్డి.. మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ నమ్మకానీ నేను వమ్ము చేయను…
Congress party
యాదవులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ కి పుట్టగతులు ఉండవని అఖిల భారత యాదవ మహాసభ హెచ్చరించింది. అంబర్ పేట్ సీటును కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ యాదవ్ కు కేటాయించాలని యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అయిలబోయిన రమేష్ యాదవ్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 100 సీట్లకు గాను 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అందులో యాదవులకు రెండు సీట్లు మాత్రమే కేటాయించడంపై మండిప్డడారు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ..సీఈసీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటి వరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంతోపాటు కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా.. అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.ఇక, మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్ను నాథ్ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.




Total views : 61931