ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి తగిన వైద్యం అందాలని తెలిపారు.కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకపోయినా నాణ్యమైన వైద్యం ఎందుకు అందించలేమని అధికారులను ప్రశ్నించారు. దీనిపైన దృష్టి పెట్టి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పారు. దీన్ని ఒక సవాలుగా తీసుకొని యంత్రాంగం పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 62173