భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరిల్లింది. కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయన దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.తెలంగాణలో భారీ ఎన్కౌంటర్. రఘునాథపాలెం ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
- 280 ఎకరాల వెంచర్ వ్యవహారంలో వివాదాలు.ప్రముఖ రియల్టర్, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
- విజయ్ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ…
- యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి