తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70.74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. అయితే, గతంలో కంటే ఈసారి పోలింగ్ 3 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ తెలిపారు. ఇక, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
hyderbad
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ మరో గంటంలో పూర్తి కానుంది. అయితే చాలా చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 3 గంటల వరకు అత్యధికంగా మెదక్లో 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం మాత్రమే నమోదైంది. అన్ని జిల్లాల కంటే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో ఓటు వేసేందుకు నగర ఓటర్లు బయటకు రావాలని ఈసీ పిలుపునిచ్చింది.
చాలా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు. నేరుగా వెళ్లి ఓటేసి వచ్చేంత ఖాళీగా ఉన్నాయి. నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, సర్కిళ్లలో ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాయి. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పోలింగ్ రోజున టూర్లకు వెళ్లకుండా ఓటు వేసేలా వారిని చైతన్యం చేసేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అయినా పరిస్థితి మారడం లేదు దీంతో హైదరాబాదీలు ప్లీజ్ బయటకు వచ్చి ఓటేయండి, ఓటు వేయటం కోసమే సెలవు ఇచ్చింది. ఎన్నికల అధికారులు ప్లీజ్ రండి ఓటేయండి అంటున్నారు.
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 20.79 శాతం నమోదయింది. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది. రంగారెడ్డిలో 29 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 26 శాతం నమోదయింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వెళ్లేందుకు ఆసక్తి చూపక పోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. హైదరాబాదీలు దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి. మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది. ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుమ కనకాల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. కేసీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది. సీఎం సతీమణి శోభమ్మ సీరియల్ నంబర్ 159, ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది.
Read Also..
Read Also..
వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చురుకుగా సాగుతోందన్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు శాంతికుమారి వివరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు.
హైదరాబాద్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండటం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లో అత్యంత తక్కువగా కేవలం 50 శాతం ఓటింగ్ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనున్నది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Read Also..
Read Also..
హైదరాబాద్ పద్మారావు నగర్ లో BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత బైక్ ర్యాలీని ప్రారంభించారు సనత్ నగర్ MLA అభ్యర్థి తలసాని. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో మంత్రి తలసాని భారీ ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. అవినీతిపరుడైన కేసీఆర్పై ఒక్క కేసు కూడా లేదన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజల సర్కార్ వస్తుందని రాహుల్ చెప్పారు.
మల్కాజీగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. కూకట్ పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ బడ్జెట్ నుండి రేవంత్ రెడ్డి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నారు మాధవరం. రాష్ట్రానికి ప్రజలకు బీజేపీ ఏమీ చేసింది లేదు. ప్రజలకు పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అభివృద్ధి కార్యక్రమాల చేపట్టన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించిన తనకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు.