వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడనే ప్రచారం జరిగినప్పటికీ తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ కు కెప్టెన్ ను ప్రకటించలేదని చెప్పారు. కెప్టెన్ ఎవరో చెప్పడానికి ఇంకా సమయం ఉందని జైషా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరనే విషయం గురించి ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ ఉన్నాయని తెలిపారు. టీ20 ప్రపంచకప్ కెప్టెన్ ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
international news
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా వేధిస్తోంది. తాజాగా సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని సిలోన్ ఎలెక్ట్రిసిటీ బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. కాట్ మలే – బియగమా మధ్య ప్రధాన విద్యుత్ లైనులో సమస్య ఏర్పడటంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. గత ఏడాదిగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. దేశంలో విద్యుత్ కోతలు కూడా కామన్ అయిపోయాయి. ప్రతి రోజూ 10 గంటల సేపు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. పీవోకే కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు. భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు, చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 69,654కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 20,938 వద్ద స్థిరపడింది.
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది. చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని, అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటన చేసింది. కాగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్‌పై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది. 14 రోజుల తర్వాత స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు.
వచ్చే ఏడాది బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిషి సునాక్ ప్రభుత్వం దేశంలోకి వలసల నిరోధానికి రంగంలోకి దిగింది. అధికవేతనాలున్న వారికే ఉపాధి వీసాలు దక్కేలా కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు పెట్టారు. దీనికి ఆమోదం దక్కితే భారతీయులపై తీవ్ర ప్రభావం తప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా బిల్లులో వీసా నిబంధనల్లో పలుమార్పులు చేశారు.
బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా పొందేందుకు గతంలో కనీసం వేతనం 26వేల200 పౌండ్లుగా ఉండేది. తాజాగా ఈ వేతనాన్ని 38వేల700 పౌండ్ల వరకూ పెంచారు. ఇక కుటుంబ వీసాకు గతంలో కనీస వేతనం 18వేల600 కాగా ప్రస్తుతం దీన్ని కూడా 38వేల700 పౌండ్లకు పెంచారు. హెల్త్ అండ్ కేర్ వీసాదారులు ఇకపై తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురాలేరు. కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాను స్పాన్సర్ చేయగలరు. స్టూడెంట్ వీసాపై ప్రస్తుతం అమలవుతున్న కఠిన నిబంధనలు వలసలను చాలావరకూ తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also…
Read Also…
మిచాంగ్ అనేది 2023లో ఏర్పడిన ఒక తుఫాన్. ఇది 2023 డిసెంబర్ 2న ఫిలిప్పీన్స్‌లోని కాగాయన్ ద్వీపంలో తీరం దాటింది. ఇది చాలా బలమైన తుఫాన్, మరియు ఇది ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టాన్ని కలిగించింది.
తుఫాన్ మిచాంగ్ 2023 నవంబర్ 29న ఫిలిప్పీన్స్‌లోని మరియానా సముద్రంలో ఏర్పడింది. ఇది త్వరగా బలపడింది మరియు డిసెంబర్ 2న ఫిలిప్పీన్స్‌లోని కాగాయన్ ద్వీపంలో తీరం దాటింది. తుఫాన్ మిచాంగ్ యొక్క గరిష్ట గాలి వేగం గంటకు 260 కిలోమీటర్లు. ఇది ఫిలిప్పీన్స్‌లో ఏర్పడిన అత్యంత బలమైన తుఫాన్లలో ఒకటి.
తుఫాన్ మిచాంగ్ యొక్క ప్రభావాలు :
తుఫాన్ మిచాంగ్ ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టాన్ని కలిగించింది. తుఫాన్ కారణంగా కలిగిన ప్రధాన ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి:
- మరణాలు: తుఫాన్ కారణంగా 900 మంది మరణించారు.
- నిరాశ్రయం: తుఫాన్ కారణంగా 100,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
- భవనాల ధ్వంసం: తుఫాన్ ఫిలిప్పీన్స్‌లోని భవనాలు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు భారీ నష్టాన్ని కలిగించింది.
- వ్యవసాయ నష్టం: తుఫాన్ ఫిలిప్పీన్స్‌లోని వ్యవసాయానికి కూడా భారీ నష్టాన్ని కలిగించింది.
తుఫాన్ మిచాంగ్ యొక్క ప్రభావం ఫిలిప్పీన్స్‌కు చాలా భారీగా ఉంది. తుఫాన్ కారణంగా భారీ ఆర్థిక నష్టం జరిగింది, మరియు తుఫాన్ నుండి కోలుకోవడానికి ఫిలిప్పీన్స్‌కు చాలా కాలం పడుతుంది.
పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. సంపన్న దేశాలు తమ సాంకేతికతను బదిలీ చేయాలని ప్రధాని మోదీ కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరుగుతున్నకాప్-28 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోనేందుకు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అందుకే.. 2028లో ఈ కాప్-33 సదస్సును భారత్‌లో నిర్వహించాలని ఈ వేదిక మీద ప్రతిపాదిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో 17శాతం భారత జనాభానే. కానీ, కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా కేవలం 4శాతమే అని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
అమెరికా లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఇడాహో రాష్ట్రంలోని పొక్టాటెల్లో లోని ఇంటర్‌స్టేట్ 86 రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం రోడ్డును క్లియర్ చేసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టినట్లు వారు వెల్లడించారు




Total views : 90022