ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో గల బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిర పడ్డారు. ఈ నెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు.
international news
షెహబాజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు:
పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాన మంత్రిగా తిరిగి రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన షెహబాజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా నేను ఎన్నికైన వేళ అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ(Narendra Modi)కి ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ ఒక పోస్ట్ పెట్టారు.
షెహబాబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ అసెంబ్లీలో తొలి ప్రసంగంలో షెహబాబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్(Pakistan)ను ఆటలో భాగం కానివ్వబోనని అన్నారు. సమానత్వం ప్రాతిపదికన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. అయితే కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. పాలస్తీనా సమస్యతో పోల్చడం గమనార్హం. కాగా 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై పాక్ తీవ్రవాద గ్రూపులు దాడులు జరిపిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల(CRPF jawans) మరణానికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార దాడి చేసింది. ఫిబ్రవరి 26, 2019న పాక్‌లోని జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి.
ఇది చదవండి: పూర్తయిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు:
ఎర్ర సముద్రం(Red Sea)లో ఇరాన్ సహకారంతో యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతి రెబల్స్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వాణిజ్య నౌక(Commercial Ship)పై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది చనిపోయారు. వాణిజ్య రవాణాతో అత్యంత రద్దీగా ఉండే ఎర్ర సముద్ర(Red Sea) మార్గంలో నౌకలపై హౌతి దాడు(Houthi attack)లు చేయడం మొదలుపెట్టాక నౌకా సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి.
బ్రిటన్, అమెరికా అధికారుల వెల్లడి..
జరిగిన దాడిలో ముగ్గురు అమాయక సిబ్బంది చనిపోయారని బ్రిటన్(Britain), అమెరికా(America) అధికారులు తెలిపారు. అమాయక సిబ్బంది చనిపోయారని ఎక్స్ వేదికగా బ్రిటన్(Britain) రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ షిప్పింగ్ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేయడం విచారకరమని, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన నౌకా సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది.
దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ..
కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది. యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ట్రూ కాన్ఫిడెన్స్ షిప్ దగ్దమైపోయిందని పేర్కొంది. కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గాజాలో యుద్ధానికి సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి
అమెరికా(America) :
అమెరికా(America) అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌న(Donald Trump)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. 2021లో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారన్న కారణంతో కొలరాడో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో పోటీ చేయకుండా ఆ రాష్ట్ర న్యాయస్థానం ఆయనపై విధించిన అనర్హత వేటును సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. అనర్హత వేటు వేసే అధికారం కోర్టుకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనర్హత వేటు వేసే అధికారం యూఎస్ కాంగ్రస్ కు మాత్రమే ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్(Trump) కు అడ్డంకి తొలగిపోయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టి..
ఫ్రాన్స్(France) చారిత్రాత్మక(Historical) నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు ఇచ్చారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా 780 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది.
ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యాలు..
మీ శరీరం మీది మీ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరు అని ఓటింగ్‌కు చట్టసభలో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యానించారు. ఈ సందేశాన్ని ఇక్కడి నుంచి మహిళలు అందరికీ పంపుతున్నామని ఆయన అన్నారు. పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి. సెంట్రల్ ప్యారిస్‌లో గుమిగూడిన అబార్షన్ హక్కుల కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు.
పార్లమెంట్లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు..
పార్లమెంట్లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం ‘నా శరీరం నా హక్కు’ అనే సందేశాన్ని కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు. మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ‘అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు’ అంటూ 2022లో అమెరికా సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పిన నాటి నుంచి ఫ్రాన్స్‌లో కార్యకర్తలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అబార్షన్‌కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని పట్టుబట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో టీమిండియా(Team India) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆసీస్ గెలుపుతో కివీస్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్లు 60కి తగ్గాయి. దీంతో 64.58 పాయింట్లతో ఉన్న భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా పాయింట్లు 55 నుంచి 59.09కి పెరిగినప్పటికీ ఆ జట్టు మూడవ స్థానానికే పరిమితమైంది.
ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా(Team India) పాయింట్లు 68.51కి మెరుగవుతాయి. అలా జరిగితే అగ్రస్థానం మరింత పదిలమవుతుంది. ఇక క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆసీస్‌పై న్యూజిలాండ్ గెలిచినా భారత్ అగ్రస్థానంలోనే ఉంటుంది. కాగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం 172 పరుగులతో తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ అజేయంగా 174 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాథన్ లియాన్ రాణించడంతో ఆసీస్ సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతమొందించడానికి గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
త్వరలోనే సహాయక చర్యలు ప్రారంభం కానున్నాయి. అమెరికా మిలిటరీ వాయుమార్గాన ఆహారం సహా ఇతర పదార్థాలను జారవిడచనున్నారు. పాలస్తీనియన్ల వెతలు తగ్గించడమే లక్ష్యంగా యుద్ధంలో దెబ్బతిన్న భూభాగాల్లో అవసరమైన సాయాన్ని అందజేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. సాయం అందించేందుకు అదనపు మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సముద్రమార్గాన సాయం అందించడంపై కూడా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జోర్డాన్‌లోని మిత్రపక్షాలతో కలిసి అదనపు ఆహారం, సామగ్రిని ఎయిర్ డ్రాప్ చేయనున్నట్టు వివరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka):
బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka)లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏడు అంతస్తుల రెస్టారెంట్లో మంటలు చెలరేగి కనీసం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ఢాకా బెయిలీ రోడ్డులోని ఓ బిర్యానీ రెస్టారంట్లో రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. మంటలకు తట్టుకోలేక కొందరు పై నుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం:
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా(Team India) మరోసారి సొంతగడ్డపై అదరగొట్టింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా శుభ్ మన్ గిల్, ధ్రువ్ జురెల్ జోడీ ఆరో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
ఇది చదవండి: ఆఖరి మెట్టుపై బోల్తాపడిన టీమిండియా..
రాంచీ టెస్టులో విజయంతో టీమిండియా ఈ ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ లో తొలి టెస్టు హైదరాబాద్ లో జరగ్గా… టీమిండియా అనూహ్యరీతిలో పరాజయం పాలైంది. అయితే, ఆ తర్వాత విశాఖ, రాజ్ కోట్, రాంచీల్లో జరిగిన మూడు టెస్టుల్లో వరుసగా నెగ్గి సిరీస్ విజేతగా నిలిచింది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నివాస భవనంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం:
చైనాలోని ఓ నివాస భవనంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగగా 15 మంది మృతి చెందారు. మరో 44 మంది గాయపడ్డారు. తూర్పు చైనా యుహువాటై జిల్లాలోని నాన్జింగ్ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బిల్టింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించినట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు 25 ఫైర్ ఇంజన్లను మోహరించింది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు నగర మేయర్ చెన్ జిచాంగ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల జరిగిన అనేక ప్రమాద ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90114