నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. ఈ రోడ్లో ఎవరు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉప్పాడ సముద్ర తీరం నుంచి మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలు అందిస్తారు.
kakinada
కాకినాడ సముద్ర తీరంలో ఓ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది. మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బోటులో ఉన్న సిలిండర్లు కూడా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు. బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 12 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలం. సోమవారం రాత్రి నుంచి ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు వేయడంతో పాటు సముద్రంలో నీటిమట్టం పెరిగి కెరటాలు ఎగిసి పడుతున్నాయి సుబ్బంపేట కొత్త పట్నం మలుపు వద్ద బీచ్ రోడ్డుకు రక్షణగా ఏర్పాటు చేసిన బండరాళ్లపై నుండి కెరటాలు బయటికి చొచ్చుకు వస్తున్నాయి సూరాడపేట రామశెట్టిపేట తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది.
కాకినాడ జిల్లా…
కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు. మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు. ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు. దీంతో మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు .ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారు సూర్యాపేటకు చెందిన గరికెన సత్తిరాజు వయసు56, దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు వయసు 35…
టిడిపి, జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, ఈ రెండు పార్టీల కూటమి గెలుపు ఖాయం అన్నారు టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. రెండు పార్టీలు కలిపి ఇస్తున్న మేనిఫెస్టోపై బూత్ అధ్యక్షుడు సంతకం పెడతాడని , భవిష్యత్ లో అవి నెరవేర్చకపోతే ప్రజలు సంబంధిత బూత్ పార్టీ అధ్యక్షుడిని నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. దీనిని ఒక డాక్యుమెంట్ గా దాచుకోవాలని ప్రజలకు సూచించారు. రెండు పార్టీల మధ్య చిన్నచిన్న పొరపాట్లున్నా అన్ని రెండు రోజుల్లో సర్దుకుంటాయి అంటున్న టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్.
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు. రేగు బాడవ, ఐతపూడి, తిప్ప రాజు పాలెం, చేదువాడ గ్రామాలలో సుమారు 1 కోటి 63 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ౨౫ ఏళ్ల చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.





Total views : 89827