కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
kakinada
కాకినాడ, ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ. కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు.
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ. పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ. పత్తిపాడుకు వరుపుల సుబ్బారావును కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన అధికార పార్టీ. ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ దీవెనలు సంపాదించుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్న పర్వత. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది , ఆ బాధ్యతలు ప్రకారం నేను నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నాని అంటున్న కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే ప్రజా దీవెన పేరుతో కార్యక్రమాలు పెడుతున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు.
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ ఈ పర్యటన ద్వారా ఓ స్పష్టత తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని ఓ పోస్టు పెట్టింది. కాకినాడలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, సామాజిక సాధికారతే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాపై జనసేనాని కసరత్తు చేయనున్నారని వెల్లడించింది. పవన్ కల్యాణ్ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది. ఎన్నికల్లో పోటీకి 70 స్థానాలపై గురిపెట్టారని వివరించింది. టీడీపీతో కలిసి సామాజిక సాధికారతే లక్ష్యంగా జాబితా రూపొందించనున్నారని శతఘ్ని పేర్కొంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉందని స్పష్టం చేసింది. ప్రత్యర్థి పార్టీలోని సీనియర్ నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నారని వెల్లడించింది.
Read Also..
Read Also..
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు. అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామ సచివాలయనికి అడ్డంగా భారీ స్టేజ్ లు ఏర్పాటు చేసి మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరి తెగించారో అర్దం చేసుకోవచ్చు. మహిళల నృత్యాలు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలవచ్చారు.
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు. నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు





Total views : 89510