మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో అభివృద్ధి చేపట్టాలని గత రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేసిన అనుభవం మంత్రి కొండ సురేఖ తమది అంటూ తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి . ప్రోటోకాల్ పాటిస్తూనే అభివృద్ధి చేపడతామంటూ ఈ సందర్భంగా సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి .
మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆటంకం కలిగిందని, ఇకమీదట సకాలంలో పంపిణీ చేపడతామని,గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూములు లబ్ధిదారులకు చేరవేస్తామని, నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎక్కువగా గురయ్యాయంటూ బాధితులకు భూమి చేరేలా కృషి చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేసినట్టుగా కలిసి అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు మంత్రి కొండ సురేఖ . గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి చేపట్టడానికి మంత్రులకు ఏలాంటి అధికారం ఉండేవి కాదని కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికై అందరు మంత్రులు కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు మంత్రి . ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలింగడం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.