బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
low pressure
ద్రోణి, ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కడలూరు, తిరునల్వేలి, మైలదుత్తరై, పెరంబలూరు, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కడలూరు జిల్లాలో సెథియతోపె ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం మారనుంది.
దక్షిణ థాయ్ లాండ్ ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు (నవంబరు 27) దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబరు 29 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థల వాతావరణ నమూనాలు వెల్లడిస్తున్నాయి.
Read Also..
Read Also..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 15 కల్లా పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి రేపటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.





Total views : 78250