లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. లక్షమంది ఒవైసీలు వచ్చినా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోలేరన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపార్టీలు ఒక్కటే అని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం కోసం కాదు అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
MIM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. కరన్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. 199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు. కాగా, 59 మంది సిట్టింగ్‌లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆప్, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్ నుంచి పోటీ ఎదురవుతున్నది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also..
Read Also..
ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తామని వాగ్ధానం చేస్తుంది. కాగా రిజర్వేషన్లపై బీజేపీ ఆరోపణలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లపై బీజేపీ అబద్ధాలు చెబుతోందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు తమ మతం ఆధారంగా కాకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నేపథ్యంలో రిజర్వేషన్లు పొందుతున్నారు.వెనుకబడిన ముస్లింల కోసం రూపొందించబడిన జాబితా ప్రకారమే రిజర్వేషన్ పొందుతున్నారని ఒవైసీ తెలిపారు.
(AIMIM)పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో, బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్ నగర్ ప్రాంతంలో జరిగిన ఎంఐఎం పార్టీ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అందరి కంటే ఎక్కువ మెజారిటీతో అక్బరుద్దీన్ ఓవైసీ గెలుస్తారాని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, mim పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసితో పాటు చంద్రాయనగుట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు AIMIM పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ, చంద్రాయనగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Read Also..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లను ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి అక్బరుద్దీన్ ఒవైసీ, నాంపల్లికి మజీద్ హుస్సేన్, మలక్ పేట్ కు అహ్మద్ బలాలా, యాకుత్ పురాకు జాఫర్ హుస్సేన్, చార్మినార్ కు జుల్పికర్, కార్వాన్ కు కౌసర్ మొహియుద్దీన్ ను ప్రకటించారు. బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.





Total views : 147265