ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు వస్తున్నవారు ఒకప్పుడు జగన్ నువిమర్శించారని, కాబట్టి నమ్మకస్తులకు టికెట్లు ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్దాయనకు బీఫారాలు ఇస్తే ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సార్పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
narayana swamy
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.
ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also..
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు





Total views : 147716