నీట్ పేపర్ లీకేజి పై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకాయి. గురువారం ఉదయం సభలు ప్రారంభం అవ్వడమే అలస్యం విపక్షలు సభను అడ్డుకోవడంతో సభలు వాయిదాల పర్వం నాలుగవ రోజు కూడా కొనసాగుతుంది. పేపర్ లీకేజీలు పై కేంద్రం వివరణ,… కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా,… విద్యార్థులకు క్షేమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు అడ్డకుకోవడంతో వరుసగా నాలుగవ రోజు కూడా సభలు వాయిదా పడ్డాయి.
అనేక కీలక అంశాల పై చర్చించేందుకు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అడుగు కూడా ముందుకు సాగడం లేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ చర్చలకు విపక్షలు ససేమీరా అంటున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజి విషయంలో పార్లమెంట్ సమావేశాలు అగ్గి రాజేసింది. పేపర్ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షలు పట్టుపట్టాయి. ఇప్పటికే మూడు రోజుల పాటు ఇదే అంశంలో ఉభయ సభలు వాయిదా పడగా నాలుగవ రోజు కూడా పరిస్థితలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఓ వైపు ఎన్డీఏ పక్షాలు మరోవైపు యూపీఏ పక్షాలు కూడా సభలో అందోళనలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకుంది. సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీలు అందోళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. చివరకు సభ నిర్వహణలో ఏలాంటి మార్పు రాకపోవడంతో సభాపతులు శుక్రవారంకు సభను వాయిదా వేశారు. సభలు వాయిదా పడిన తరువాత కూడా విపక్షలు పార్లమెంట్ ఎదుట ప్లేకార్డులతో అందోళను చేపట్టాయి.
పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదంటే కేంద్ర ప్రభుత్వమే అయను బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పై లాఠీలు జులిపించినందుకు ప్రభుత్వం వారికి క్షేమాపణ చెప్పాలని సభలు నినాదాలు చేశారు. విద్యార్థుల పై బలప్రయోగానికి చేయడమే కాకుండా వారి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చిన తరువాతే నీట్ పై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.
పశ్నపత్రాల లీక్ విషయంలో సభలో చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తరువాతే చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రూల్ 267 కింద చర్చ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలను అవమానించారని అయన ఆరోపించారు. అయితే దీని పై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌రిజిజు మాట్లాడుతూ నీట్ పై చర్చ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాలు అడ్డకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చర్చలు జరిపేందుకు మేము సిద్దంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా చర్చలకు ముందే షరత్తులు పెట్టడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు.
ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీల పై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించడం జరిగింది. పేపర్ లీకేజీల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయంలో స్పందించారు. మునుముందు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల పై వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడే నింధితులకు త్వరతిగతిన శిక్షలు వేసేందుకు వీలుగా చర్యలు చేపడతామని అయన ఎక్స్ వేధికగా ప్రకటించారు. దేశ యువత భవిష్యత్తు వారి సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని వెల్లడించారు.
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పై ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరు అంటూ కౌంటర్ ఇచ్చారు. దేశ యువత భవిష్యత్తుకు అతి పెద్ద ద్రోహం చేసి, దానిని నాశనం చేసింది మీరే అని ఆరోపించారు. విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారిపోయేలా చేశారని, కేవలం కొంతమంది చేతుల్లో బందీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి వారికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని విరుచుకుపడ్డారు.