ప్రకాశం, యర్రగొండపాలెంలో ఓ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు. మంటలు అర్పిన పోలీసులు గాయపడ్డ యువకుడు మోజేశ్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని ఓబుల్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న యువకుడి బంధువులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. రోడ్లపై టైర్లు కాల్చి ధర్నా చేస్తున్న యువకుడి బంధువులు, యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం….
political
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజా సానుకూల పాలన అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆయన ఖమ్మం జల్లా నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారన్నారు. కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారు మారయ్యాయని అన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు..ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో..పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా.. రేవంత్ సీఎంగా.. మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు.
ఇక..రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు. ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే, కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కవిత వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ దృష్టికి తెచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. అర్హతలేని వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ అని విమర్శించారు. జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందన్నారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్‌కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్. ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఏక పార్టీ ప్రభుత్వం రాదని తెలిపారు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదామని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని… హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నామని ఈ నేపథ్యంలో ఆయన తెలిపారు. ప్రతి స్కీంలో అందరం భాగస్వామ్యం అవుతున్నామని అందరం సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నామన్నారు. పదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదన్నారు కేసీఆర్. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
అనంతపురం జిల్లా: అక్రమ ఇసుక రవాణా దందా పై అధికారుల దాడులు, 17 టిప్పర్లు సీజ్
అనంతపురం జిల్లా…
రాయదుర్గం నియోజకవర్గం…
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి ఇసుక రిచ్ పై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు దాడులు
- ఒక హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు
- రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగింత
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జంజురాంపల్లి వేదవతి హగరి నది ఇసుక రీచ్ పై మైనింగ్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదుతో వెళ్లిన మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారులు. హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసి రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతపురం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ ఇంచార్జ్ అధికారి, తాడిపత్రి కి చెందిన నాగన్న ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ అనుమతులు ముగిసిన పెద్ద ఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్లలో బహిరంగంగా ఇసుకను తరలిస్తూ జెకె కంపెనీ వారు ఇసుక రీచ్ లో వసూళ్లకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రిపూట భారీ సంఖ్యలో టిప్పర్లలో జుంజురాంపల్లి, వేపరాళ్ళ రీచ్‌ల నుంచి ఇసుక కర్ణాటకకు అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గం నియోజకవర్గంలో నుంచి అధికార పార్టీ నేతలు అండదండలతో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతోంది. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనంతపురం వెళ్లడం శోచనీయం. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో ఉంచిన టిప్పర్లను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ డిపో వద్ద కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైకాపాలనలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతుందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 ఇసుసుక రీచులు ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబునల్ అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో , రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండదండలతో ఇసుక స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన ఆరోపించారు. జుంజురాంపల్లి ఇసుక రీచ్ లో సీజ్ చేసిన టిప్పర్ల వివరాలను అధికారులు వెల్లడించాలని, వాటిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




Total views : 54877